Listen the Song
చిత్రం: దళపతి (2017)
సంగీతం: వినోద్ యాజమాన్య
సాహిత్యం: గోసాల రాంబాబు
గానం: వినోద్ యాజమాన్య , శ్రేయ ఘోషల్
నటీనటులు: బాబు USA, సదా, ప్రియాంకా శర్మ, కవితా అగర్వాల్
దర్శకత్వం: సదానంద రెడ్డి
నిర్మాత: బాబూరావు పెదపూడి
పల్లవి:
నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే.. చెప్పేమందే
పెదవులే నీ పేరే పలికెనే మంత్రంలా
ఎద లయే నీకోసం పరుగాపదేలా…
అడిగా అడిగా… ఒక మనసుతో కలవమని
త్వరగా త్వరగా… నా దగ్గర చేరమని
జతగా జతగా… అడుగులనే వెయ్యమని
శృతిగా జతిగా కడదాకా సాగమని
నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే.. చెప్పేమందే
చరణం: 1
ప్రాణమే ఎదురుపడి అడిగితే
మౌనమే విడిచివెళ్లి పోయనే ఏమో…
కనులే నావి కలలే నీవి
మరుపురాని నా ఉహలలో చేరిపోవా ఇలా…
నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే.. చెప్పేమందే
చరణం: 2
ఆ…కాలమే ఆగి మరి చూసెనే
మేఘమే వలపు కురిపించెనే తెలుసా…
ఏదో మాయే జరిగేనేమో
నీతోడుంటే ఈ క్షణములనే మరువనులే ప్రియా…
నీకు నాకు మధ్య – ఏదో ఉందే.. ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను – చెప్పేమందే.. చెప్పేమందే