Damarukam (2012)

చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: జస్ప్రీత్ జస్జ్ , సునీత
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: వెంకట్
విడుదల తేది: 23.11.2012

కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ..
మీనాకుమారి ఓ మీనాకుమారి నీ కల్లలోనే ఉండాలంటే ఎం చెయ్యాలే నారీ..
వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలినివ్వాలీ
చక్కెర కన్నా తీయగ నన్నే ప్రేమించాలీ..
హెయ్ రావే నీ పేరు వెనకే నా పేరు పెడతా మధుబాలా..
హెయ్ రా రా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా..

హో నీ మీసం చూసీ మెలి తిరిగెను వయ్యారం
అది తాకితె చాలు నిదరే రాని రేయికి జాగారం..
నడుమే నయగారం ఆ నడకే శ్రుంగారం
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అబిషేకం..
కల్లతొ నన్నే గారడి చేయకు మదనుడి మరిది వలే..
హెయ్ కల్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే..
హెయ్ రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా..
హెయ్ రా రా నీ ముద్దు మాట కి నా సోకులిస్తా గోపాలా..

కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ..
మీనాకుమారి ఓ మీనాకుమారి నీ కల్లలోనే ఉండాలంటే ఎం చెయ్యాలే నారీ..

ఓ సూటిగ నీ చూపే నా గుండెను తాకిందీ
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకిందీ..
నీలో నిప్పుందీ అది నాలో రగిలిందీ
ఎదలొకటై తెలవారే వరకూ ఆరను లెమ్మందీ..
ఓ ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగను ఇదివరకూ..
ఒంటరి తుంటరి తుమ్మెద లాగ అంటుకుపోకూ..
హెయ్ రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా..
ఓ ఓ రా రా నీ ముద్దు మాట కి నా సోకులిస్తా గోపాలా..

కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ..
రాజకుమారా ఓ రాజకుమారా నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి..

*******  *******   *******

చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: గోపిక పూర్ణిమ

లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ
లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ
నీతో ఆడాలంటు నేల జారెనంట జాబిల్లి
నీలా నవ్వలేనంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి

లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ
లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ

బోసి పలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయె వాకిలీ
లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయె లోగిలీ
నీ చిన్ని పెదవంటికీ పాలనదులెన్నొ యెదలోన పొంగి పొరలీ
నిను కన్న బాగ్యానికీ తల్లి తలవంచి మురిసింది ఈ ఆలీ
లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ
లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ

లాల నీకె నే పోసేటివేలా అబిషేకంలా అనిపించెరా
వుగ్గు నీకు నే కలిపేటి వేలా నైవేద్యంలా అది ఉందిరా
సిరిమువ్వ కట్టేవేలా మాకు శివ పూజె గురుతొచ్చె మరల మరలా
కేరింత కొట్టే వేలా ఇళ్లె కైలాసంల మారె నీవల్లా
లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ
లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ

*******  *******   *******

చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్ , చిత్ర

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా..
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా..
నెమ్మది నెమ్మదిగ ఝుం ఝుం ఝుమ్మని తుమ్మెదగా
ముచటగా మూడొ ముద్దుకు చోటిమ్మంటున్నా..
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా
తియ్యని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా..

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా..
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా..

జరిగి జరిగీ దరికి జరిగీ కలికి విరహాలు కరగనీ..
కరిగి కరిగీ కలలు మరిగీ తగిన మర్యాద జరగనీ..
సొంపుల రంపంతో నాపై చక్కిలిబొతవె
చుక్కల రెక్కల సీతకోకై నోరూరించావే..
పువ్వుల ప్రాయంలో గుప్పున నిప్పులు పోసావే
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే..

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా..
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా..

చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో..
పులకరింతే మరొక వింతై అనువు అనువంత రగిలిపో..
గోపురమే నువ్వు నీపై పావురమై నేను
గుప్పెడు గుండెల ప్రాంగనమంతా నాదని అంటాలే..
గొపికవే నువ్వు నాలో కోరికవే నువ్వూ
నీ పున్నమి వెన్నెలనేలె పురుషుడు నేనెలే..

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా..
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా..

*******  *******   *******

చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ హరిణి

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారన నీకోసం..
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడన నీకోసం..

నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమ లాగా..
ఒహో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తె
ఉండదా నిండుగా మనలొనా..

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారన నీకోసం..
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడన నీకోసం..

నువ్వంటే..ఎంతిష్టం..సరిపోదే..ఆకాశం..
నాకన్నా..నువ్విష్టం..చుసావా..ఈ చిత్రం..
కనుపాపలోనా నీదే కలా ఎద యెటిలోనా నువ్వే లయా
క్షణ కాలమైనా చాల్లే ఇలా అది నాకు వెయ్యెల్లే..
ఈ క్షనం కాలమే ఆగిపోవాలే ఓ ఓ ఓ..

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారన నీకోసం..
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడన నీకోసం..

అలుపొస్తే..తల నిమిరే చెలిమౌతా నీకోసం..
నిదరొస్తే తల వాల్చే వొడినౌతా నీకోసం..
పెదవంచు పైనా నువ్వే కదా పైటంచు మీదా నువ్వే కదా
నడుమొంపులోనా నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే..
అరచేతిలో రేకలా మారిపోయావే ఓ ఓ ఓ..

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారన నీకోసం..
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే
తూరుపై చూడన నీకోసం..