Dasavathaaram (2008)

చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
(Background Music: దేవి శ్రీ ప్రసాద్)
సాహిత్యం: వేటూరి
గానం: సాధనసర్గమ్
నటీనటులు: కమల్ హాసన్, ఆసీన్, మల్లికా శరావత్, జయప్రద,
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: వేణు రవిచంద్రన్
విడుదల తేది: 13.06.2008

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
వెన్నదొంగవైనా మన్నుతింటివా
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

జీవకోటి నీచేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..
సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..

నీలాల నింగికింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా
అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే

హే ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

*********   ********   ********

చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: హరిహరన్

పల్లవి:
ఓం… నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు

చరణం: 1
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే
వీర శైవుల  బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగరాజనే

చరణం: 2
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

*********  ********  ********

చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మహాలక్ష్మి అయ్యర్, షాన్

సాకీ:
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం

పల్లవి :
ఓ ఓ సనమ్… ఓ ఓ సనమ్… ఓ ఓ… (2)

చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం
చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట

ఓ ఓ సనమ్… ఓ ఓ సనమ్… ఓ ఓ… (2)

చరణం: 1
నీ దారిలో ముళ్లున్నా నా దారిలో రాళ్లున్నా ఏరెయ్యవా పాటలే
ఏ గుండెలో మృగమున్నా ఏ చూపులో విషమున్నా మార్చేయవా పాటలే
మాటలాడు ఆ ధైవమే మాతృభాష సంగీతమే
మట్టిలో జీవితం కొంతకాలం పాటతో జ్ఞాపకం ఏంతో కాలం
ఇది తెలుసుకో సోదరా ఎద గళముతో పాడరా

ఓ ఓ సనమ్… ఓ ఓ సనమ్… ఓ ఓ… (2)

చరణం: 2
ఆ పువ్వుకి ఆయుష్షు మూన్నాల్లో ముగిసేను అందించదా తేనెలే
ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తూ నే పాడనా లాలిని
లయలో శ్రుతి కలుపుదాం బ్రతుకును బ్రతికించుదాం
కాలమే గొంతుని మూసేస్తుంది గాలిలో గీతమే మోగిస్తుంది
నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం

ఓ ఓ సనమ్… ఓ ఓ సనమ్… ఓ ఓ… (7)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Raktha Tarpanam (1992)
error: Content is protected !!