చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి, లలిత
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: డి. ఎల్. నారాయణ
విడుదల తేది: 26.06.1953
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి
కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
భాదే సౌఖ్యమనే భావనే రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: రావు బాలసరస్వతిదేవి
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ
అలుక చేసి ఇంటికి రావైతివి
అలుక చేసి ఇంటికి రావైతివి
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే
చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే
తలచి చూడనా తానే దైవము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
అంతరంగమైనా నీవే ఆదరించేవు నీవే
అంతరంగమైనా నీవే ఆదరించేవు నీవే
చింతించి చూడనా జీవనము నీవే
చింతించి చూడనా జీవనము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జమునా రాణి, ఉడత సరోజిని
ఓ దేవదా ఓ పార్వతీ
చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా
ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా
ఓ దేవద
కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే
కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే
బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట
బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట
ఓ పార్వతీ
రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
ఓ పిరికి పార్వతి
తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత
ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత
రా రా పిరికి పార్వతి పో పో దూకుడు దేవద
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల, జిక్కీ (పి.జి. కృష్ణ కుమారి)
ఓ దేవదా ఓ పార్వతీ
చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవద చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవద
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు
ఓ పార్వతీ
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
ఓ పార్వతీ
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా
ఓ పిరికి పార్వతీ
ఓ దుడుకు దేవద
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి
ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి
మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో
నగవేమో వగేమో కనులారా చూదము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో నా దరికి దూకునో
తానలిగి పోవునో ఏమౌనో చూదము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: రావు బాలసరస్వతిదేవి
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
పొంగారే సోయగము రంగు సేయగా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్యా
ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్యా
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
నీడగా జోడుగా ఆడిపాడేనయ్యా
నీడగా జోడుగా ఆడిపాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా
హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
పొంగారే సోయగము రంగు సేయగా
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ..
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే ఓ..
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే
చివురించిన పూదేవీ విరియగా
విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా
రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: కె.రాణి
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
చిలిపితనాల చెలిమే మరచితివో..
చిలిపితనాల చెలిమే మరచితివో..
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా
నా ఆశే దోచినదా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
మనసునలేని వారి సేవలతో
మనసునలేని వారి సేవలతో
మనసీయగలేని నీపై మమతలతో
మనసీయగలేని నీపై మమతలతో
వంతలపాలై చింతించే నా వంతా దేవదా
నా వంతా దేవదా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా..ఆ..ఆ..
సుడిలో దూకి ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా..ఆ..
మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా..
కొండలే రగిలే వడగాలి..కొండలే రగిలే వడగాలి..
నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోన లాయిరీ నడిసంద్రములోన
లంగరుతో పనిలేదోయ్ లంగరుతో పనిలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే నీ దారే వేరాయే
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
మరుపురాని బాధ కన్నా మధురమే లేదు
మరుపురాని బాధ కన్నా మధురమే లేదు
గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు
గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు
అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా
రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా
దారిలేని భాదతో నేనారిపోయెనా కధ తీరిపోయేనా
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
******** ******** ********
చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: రావు బాలసరస్వతిదేవి
తానే మారెనా గుణమ్మే మారెనా
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
తానే మారెనా గుణమ్మే మారెనా
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
తొలిచూపు నాటి రూపు మారే
ధోరణి మారె
తొలిచూపు నాటి రూపు మారే
ధోరణి మారె
నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా
వలపు తీరు ఈ తీరౌనా …ఆ…
వలపు తీరు ఈ తీరౌనా
మా చెలిమి కలలో పెన్నిదేనా…ఆ…ఆ..ఆ
పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ
తానే మారెనా గుణమ్మే మారెనా
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా
ఏరి కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా తానే
నా సేవలకు ఇంతే వరమా… ఆ…
నా సేవలకు ఇంతే వరమా… ఆ…
నాకిదే కడసారి దరిశనమా ….ఆ….ఆ…ఆ
అడియాస పాలు చేసినారు కోరినవార
అడియాస పాలు చేసినారు కోరినవార
అడియాస పాలు చేసినారు కోరినవారు
మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే
గాలీ మేడ కూలీపోయి ఈ తీరాయెనా
తానే మారెనా గుణమ్మే మారెనా
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా