Devatha Neeve Na Devatha Neeve Song Lyrics

దేవత నీవే.. నా దేవత నీవే… లిరిక్స్

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: దీపు
నటీనటులు: విశాల్ కృష్ణ, ప్రియమణి
దర్శకత్వం: భూపతి పాండ్యన్
నిర్మాణం: విక్రమ్ కృష్ణ
విడుదల తేది: 28.09.2007

దేవత నీవే.. నా దేవత నీవే..
కనుపాపగ కాస్త నిను నే రెప్పనై
నా జత నీవే.. ఇక నా కత నీవే..
ఎడ బాయక ఉంటా.. తోడు నీడనై
నీలో నేను సగములే.. నీవే నాకు జగములే..
నీతో యుగమే క్షణములే..
ఇది మన మనసుల కలయిక ముడి

దేవత నీవే.. నా దేవత నీవే..
కనుపాపగ కాస్త నిను నే రెప్పనై

చినుకై వచ్చే నీకోసం, పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం, కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం, కన్నై పోతాను
ఉలిలా నన్ను తాకావొ, శిల్పాన్నవుతాను
నీ ఊపిరితో ఈ వెదురైనా వేణువు కాదా..
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాదా..
సూర్యుని చుట్టూ భూమిలా, నీ చుట్టూనే తిరగనా..
నీవే నేనై బతకనా, తలపుల తలపులు తెరిచిన చెలి

జోరున కురిసే వానల్లో, ఎండే నువ్వంట
నిప్పులు చెరిగే ఎండల్లో, వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసే, తోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే, జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి, పువ్వైపోనా..
నీ నడకల్లో మోగేటి, మువ్వైపోనా..
గుడిలో వెలసిన రూపము, గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము, వలపుల పిలుపులు తెలిపెను మది

దేవత నీవే.. నా దేవత నీవే..
కనుపాపగ కాస్త నిను నే రెప్పనై
నా జత నీవే.. ఇక నా కత నీవే..
ఎడ బాయక ఉంటా.. తోడు నీడనై
నీలో నేను సగములే.. నీవే నాకు జగములే..
నీతో యుగమే క్షణములే..
ఇది మన మనసుల కలయిక ముడి

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

3 thoughts on “Devatha Neeve Na Devatha Neeve Song Lyrics”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top