Devathala Ninnu Chustunna Song Lyrics | దేవతలా నిను చూస్తున్నా లిరిక్స్

దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా… లిరిక్స్

చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: హరీష్ రాఘవేంద్ర
నటీనటులు: అల్లరి నరేష్, అర్చన, అభిషేక్
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాణం: ముళ్ళపూడి బ్రహ్మానందం
విడుదల తేది: 15.04.2004

దేవతలా.. నిను చూస్తున్నా…
దీపంలా.. జీవిస్తున్నా…
నా ప్రాణం నువ్వు తీస్తున్నా…
నీ ధ్యానం నే చేస్తున్నా…
ఎవరమ్మా.. నువ్వెవరమ్మా..
ఇంతకీ.. నాకు నువ్వెవరమ్మా..
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక
మిగిలింది వేళ్ళపై అది వాలిన మరక
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక
మిగిలింది వేళ్ళపై అది వాలిన మరక
ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఓ.. ఆరారో..

దేవతలా.. నిను చూస్తున్నా…
దీపంలా.. జీవిస్తున్నా…

సుడు గాలికి చిరిగినా.. ఆకు అలగదు
చెలి చూపుకి నలిగినా.. మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలూ…
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అందీ.. అందని దానా.. అందమైన దానా..
అంకితం నీకే అన్నా.. నను కాదన్నా..
ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఓ.. ఆరారో..

దేవతలా.. నిను చూస్తున్నా…
దీపంలా.. జీవిస్తున్నా…
నా ప్రాణం నువ్వు తీస్తున్నా…
నీ ధ్యానం నే చేస్తున్నా…

నిప్పును పువ్వనుకుంటే.. తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలూ..
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూసే సన్న జాజులు
నిదర రాని నిట్టూర్పుల జోల పాటలు
చక్కనైన చినదానా.. దక్కని దానా..
రెక్కలు కట్టుకు రానా.. తెగిపోతున్నా..

ఆరారో.. [ఆరారో.. ] ఆరారో.. [ఆరారో.. ]
ఆరారో.. [ఆరారో.. ] ఓ.. ఆరారో.. [ఓ.. ఆరారో.. ]

***** ***** సమాప్తం ***** *****

error: Content is protected !!