Devi Putrudu (2001)

Advertisements

చిత్రం: దేవిపుత్రుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య, అంజలీ జవేరి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యమ్.ఎస్.రాజు
విడుదల తేది: 15.01.2001

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమే
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమే

చరణం: 1
నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగ రం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే

చరణం: 2
పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంట
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత
అడుగేసి తీస్తే హంస జోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమే

*********   *********   *********

చిత్రం: దేవిపుత్రుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: శంకర్ మహదేవన్

హే… దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే… ముంబై లోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
హే… దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే… ముంబై లోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

సెంటర్ లో డాషిచ్చీ ఓయమ్మో .. ఓ ఓ
జంక్షన్ లో స్పాటేట్టీ ఓయబ్బో .. ఓ ఓ ఓ
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఆహ ఇట్టే మాయమవ్తాడే

చరణం: 1
పల్స్ పట్టుకొని జాకెట్లోని పర్సులొ ఉన్నది చెప్పేస్తా
వాసన చూసి హ్యాండు బ్యాగులో ఎం దాచావో పసిగడతా

శాబ్బా శాబ్బ రబ్బబ్భా ( 2 )

చీర కొంగులో ముడేసుకున్నా చిల్లర ఎంతో వివరిస్తా
బొడ్లో దోపిన రూపాయ్ నోటుకు నంబరు ఎంతో కనిపెడతా
అ పెద్దా బ్యాండ్ వేస్తాడే అ చెడ్డా బ్రాండు వీడేలే
జేమ్స్ బాండ్ గాడైనా షేకు హ్యాండ్ ఇస్తాడే…

చరణం: 2
పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుట్టును తెచ్చేస్తా
నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా

శాబ్బా శాబ్బ రబ్బబ్భా ( 2 )

Advertisements

పాపం సొమ్మే కాజేస్తా హ్యాపీగానే గడిపేస్తా
ఎప్పటికప్పుడు 50 శాతం బీదా బిక్కికి పంచేస్తా
అ నన్నూ పట్టుకోలేరే మొత్తం గ్లోబు మీదనే
నాకు ఇన్సిపిరేషనే ఉడిపి కృష్ణభగవానే

*********   *********   *********

చిత్రం: దేవిపుత్రుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, ప్రసన్న

ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా
ప్రాణమా…
ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా
కుంకుమ…
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా

చరణం: 1
అసలెందుకే ఆ అమృత మే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
సెగ కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి…

చరణం: 2
శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చే రుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి…

*********   *********   *********

చిత్రం: దేవిపుత్రుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ
తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా
తాకితే సితార శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ
తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా

చరణం: 1
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం తపనే తకధిమి తలాంగు తోం తోం తోం
ఇంద్ర ధనుస్సు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం

తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ

చరణం: 2
ప్రియ వనితా చీర మడత చక్క చేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాలా ముందుంది ఇంకా చాలా
జాజులా మజాలా పూబంధం పూయాలా

తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ
తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా
తాకితే సితార శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా

Advertisements

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Mechanic Alludu (1993)
error: Content is protected !!