చిత్రం: దేవుడు (1997)
సంగీతం: శిరీష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , రమ్యకృష్ణ , రుచితా ప్రసాద్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: ఎ. గోపీనాథ్, యమ్.వెంకట్రావు, సి.కృష్ణారావు
విడుదల తేది: 23.10.1997
ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నది
ఈడెక్కి కొక్కరో కోయ్ అన్నది పెట్ట జోడెక్కడంటున్నది
వేడెక్కిపోయిన ఒంటరి తనమే మగదిక్కు నువ్వంది
లేటిక చేయక రమ్మని నీకు తెగ మొక్కుకొంటుంది
పొంగుల పోరు తీర్చమందిరో…

కౌగిళ్ళు నోచని పరుపు దిండ్లు రాలల్లే ఉన్నవయో..
అల్లర్లు ఓపని నీ పసి ఒళ్ళు అల్లాడుతున్నదమ్మో
తోచింది చేసే కాదన్నాన తప్పించుకోను కదా ఏం గొడవైన
సిగ్గుంటే తరిమే మొదలెడు తున్నా
వద్దంటే వప్పుకోను కెవ్వంటున్నా
కేరింత కేక ఆనందమేగా
ఆయువు కందిరీగ కన్నెతీగ కందిపోగా
ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నది
ఈడెక్కి కొక్కరో కోయ్ అన్నది పెట్ట జోడెక్కడంటున్నది
గోరింట పూసిన నీ కసి గోళ్లు గిచ్చాయి పులి గోళ్లై హబ్బా
కవ్వింత నేర్చిన కొత్త యవ్వనాలు వచ్చాయి వడగళ్ళై
ఉసురుమన్న నీ ఊపిరి లేక అందింది నాకు కాముడు చిలక
వచ్చావు గనక అవిఇవి అనక గిచ్చేసుకోవోయ్ నిక్షేపంగా
కోనంగి కోక సారంగి సోక ఎక్కిళ్ళు ఎందుకింక
దిక్కుంది ముందువెనుక..