Devudu Chesina Manushulu (2012)

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శ్రేయ గోషల్
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 15.08.2012

నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ

చరణం: 1
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచాన అంటే ఏంటో చిత్రంగా ఉంది నాలో నాకే
నువ్వే లేకుండా ఇంత కాలం బతికాన అంటే  ఏమో కలనైన నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని కన్నుల చేరని వెన్నెలనీ
అందించావని ఆనందిస్తా నీ తోడులో
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకనే చూస్తున్నా కద నీ ప్రేమలో

చరణం: 2
ఏదో తింటున్నానంతే ఏదో ఉంటున్నానంతే
నువ్వే ఎదురవ్వక పొతే రోజు ఇంతే
నాకే నే బరువై పోయా నాలో నే కరువై పోయా
నిన్నే కలిసుండకపొతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకొని నాలో నే మాట్లాడుకొని
గడిపేశానని గుర్తే రాదిక నీ నీడలా
నాకేతోడు దొరకదని  ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ