Devullu (2001)

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: చిత్ర, రాజేష్
నటీనటులు: పృథ్వి రాజ్ , రాశి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: చేగొండి హరిబాబు, కరటం రాంబాబు
విడుదల తేది: 10.11.2000

సాగర ఘోషల శృతిలో
హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం
సునోరే భాయి సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ…సత్యాహింసలు శృతిలయిలైన
మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం
ప్రపంచ శాంతి సంకేతం…

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి
కర్ణాటక భావాలు కమ్మనైనవి
సగమ గమగ మగని సానిద సానిదనిసా
ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన
ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్

సరిగరి సరిగరి సనిదని పదనిస పదనిస పమగమ నిస నిదప మపదప
గరి మగ పమ దప మగ పమ దప నిద
నిసాస దనీని పమగప పమగప పమగప

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది

ఆ… దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వారాలతో ఈయగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరూ బందువులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట
నయాగరా హోరులో ఆలపించగా
సగమ గమగ మదని సానిస నిదమ గమగ మగస నిసగ మదనిస గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ మపదప పదనిద దనిసని నిసరిస
సనిదప మగరి నిదప మగరిస సని దనిస నిసని సరిగ రిగమ
రిగమ గమప మపద పదనిసా…ఆ…ఆ…

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

*********   *********   **********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: ఎస్. జానకి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధీష్ఠించు అధిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా  నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

*********   *********   **********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా….

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ…ఆ…ఆ…ఆ…

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ…ఆ…ఆ…ఆ…

*********   *********   **********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి
జనకృందములచేరె జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ముకాగా
ధీమంతుడైలేచి ఆ కన్నెస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై
పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణుఘోషలు విని రోజూ శబరీషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాదినేత

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః

ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం…
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానదీ తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః… ఓం శాంతి శాంతి శాంతిః

*********   ********   ********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: సుజాత, స్వర్ణలత

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ

షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో
వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయి…….. సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి
బాబా భోదల నిలయమదోయి

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ

ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె
నీటి దీపములను వెలిగించె
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె
ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికె
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం

నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై గురుపౌర్ణమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్

*********   ********   ********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

రామా… రామా…
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
రామా… రామా…

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా… ఆ…ఆ…
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా… ఆ…ఆ…
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా

అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

*********   ********   ********

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: చిత్ర, స్వర్ణాలత

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
గోరుముద్దలెరుగని బాలకృష్ణులం
భాద పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం

కమ్మగా మా అమ్మచేతితో
ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా
సరదాగా తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెళతారు
రాతిరికి ఎపుడో వస్తారు
మరి మరి అడిగినా కథలు చెప్పరు
మేమేం చెప్పినా మనసుపెట్టరు
అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు
ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు

ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం

పిల్లలం మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు
కనిపించే శివుడు పార్వతులు
లోకం బూచికి మా గుండె వణికితే
మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి
అనాధలను చేయకండి పసిపిల్లలని

ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Attintlo Adde Mogudu (1991)
error: Content is protected !!