ఎవరికోసం ఎందుకోసం… లిరిక్స్
చిత్రం: దాడి (2020)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: శ్రీ కృష్ణ
నటీనటులు: శ్రీరామ్, జీవన్, గణేష్ వెంకట రమణ, అక్షర రెడ్డి, సితార
దర్శకత్వం: మధు శోభ టి
నిర్మాణం : ఆర్ల శంకర్
విడుదల తేది: —-
Evari Kosam Song Lyrics | Dhaadi Movie
ఏది జీవితమేది మృత్యువు… ఏది చీకటి వెలుతురంటూ
నడిచే దారిలో చావు ఉందని… తెలిసే రోజు ఎప్పుడంటూ
ఎవడు చేసిన పాపమిదిరా… ఎవరికో పెను శాపమిదిరా
ఎవడు తీసిన ప్రాణమిదిరా… ఎవరిపై ఈ కోపమో
ఎవరికోసం ఎందుకోసం… జరుగుతున్న దాడిరా
తల్లడిల్లే తల్లి భాధకు… కారణం ఏ బిడ్డరా
కలత చెందిన కలము చేసే… ఎదురుదాడి నీదిరా
కలలు చెదిరిన కనులు చూపే… బెదురు లేని దారిలా
చెరిపివేసిన రాతలా… తిరిగి రాసే భూతలా
తెరలు కమ్మిన రాతిరి… చెరను చీల్చే తొత్తులా
తరలిరారా తరలిరారా… తరలిరారా సూర్యుడై
అక్షరాన్నే ఆయుధంగా… మలుచుకున్న వీరుడై
ఎదుటఉన్న గ్రహణమే… ఉరుముతున్నా గగనమై
మింగుతున్నా గరళమే… జగము గాచే శివములై
కన్నతండ్రి ఆశయాన్ని… తలలుదాల్చిన తనయుడు
జగము నీదే జనము నీదే… వెలుగు పంచు భానుడై
ఓ మహాత్మ, ఓ మహర్షి… శాంతి కోరిన క్రాంతివే
తల్లడిల్లిన తల్లి బాధను… తీర్చగలిగే కాంతివే
Dhaadi Movie 2020 Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****