చిత్రం: దన 51 (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌశల్య
నటీనటులు: సుమంత్, సలోని అశ్వని
దర్శకత్వం: సూర్యకిరణ్
నిర్మాత: యమ్. యల్. కుమార చౌదరి
విడుదల తేది: 14.01.2005
పల్లవి:
ఐ యామ్ ఇన్ లవ్ ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్ ఐ ఫీల్ మై లవ్
ఏమేమో అవుతుంది ఏమో మరి
నా కేమైందో తొలిసారి ఈ లాహిరి
ఏలో ఏలో ఏలో చలేస్తుంది నీలో
ఉయ్యాలెక్కి ఊగాలి ఈ వేళలో
ఐ యామ్ ఇన్ లవ్ ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్
చరణం: 1
ఏదోటిచేయి ఇలా కలుపు చేయి
మదే నిండిపోయి భళేగుంది హాయి
అలై నువ్వు వచ్చేమరీ
సూదంటు రాయి నీ చూపేనురోయి
లాగేసింది నీ వైపుకి హోయ్ హోయ్
సరికొత్త గిలిగింత ప్రేమేనని
తనువంత పులకించి పోయిందని
హుషారాల హేల తుఫానైన వేళ
తమాషాలు చేరాలి ఈ ప్రేమలో
ఐ యామ్ ఇన్ లవ్ ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్
చరణం: 2
నువులేని దారి సహారా ఎడారి
నేనే నిన్ను కోరి నాలో నువ్వు చేరి
ఇలా ఉండిపోతే సరి
నీ గుండెలోని నన్నే ఉండిపోని
ఎలాగైన నీ దానిని హోయ్ హోయ్
శిల లాగ ఇన్నాళ్లు ఉన్నానని
అలలాగ మార్చింది నువ్వే చెలి
నువ్వే నేను కాదా నీలో నేను లేన
ఇలా ఏకమవ్వాలి ఈ ప్రేమలో
ఐ యామ్ ఇన్ లవ్ ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్