Dhanama Daivama (1973)

చిత్రం: ధనమా దైవమా (1973)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జమున
దర్శకత్వం: సి. యస్.రావు
నిర్మాత:
విడుదల తేది: 24.05.1973

నీ మది చల్లగా… స్వామీ నిదురపో
దేవుని నీడలో… వేదన మరచిపో…
నీ మది చల్లగా…

ఏ సిరులెందుకు?… ఏ నిధులెందుకు?
ఏ సౌఖ్యములెందుకు?… ఆత్మశాంతి లేనిదే..
మనిషి బ్రతుకు నరకమౌను…
మనసు తనది కానిదే…

నీ మది చల్లగా… స్వామీ నిదురపో
దేవుని నీడలో… వేదన మరచిపో…
నీ మది చల్లగా…

చీకటి ముసిరినా?… వేకువ ఆగునా?
ఏ విధి మారినా… దైవం మారునా?
కలిమిలోన లేమిలోన…
పరమాత్ముని తలచుకో…

నీ మది చల్లగా… స్వామీ నిదురపో
దేవుని నీడలో… వేదన మరచిపో…
నీ మది చల్లగా…

జానకి సహనము… రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచె ఆదర్శము
వారి దారిలోన నడచువారి జన్మ ధన్యము…

నీ మది చల్లగా… స్వామీ నిదురపో
దేవుని నీడలో… వేదన మరచిపో…
నీ మది చల్లగా…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Alludugaru (1990)
error: Content is protected !!