చిత్రం: ధర్మచక్రం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద
మాటలు ( డైలాగ్స్ ):
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దీపక్
నిర్మాత: వి యస్. నరసింహారెడ్డి
బ్యానర్: వై.ఎల్. ఎన్. పిక్చర్స్
విడుదల తేది: 1980
పల్లవి:
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో..నీ ఒడిలో…
తీయని కౌగిలిలో…
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో..నీ ఒడిలో…
తీయని కౌగిలిలో…
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
చరణం: 1
నడకే మయూరమాయే…నడుమే వయ్యారమాయే
మెరుపుగా మారిపోనా…నీ కళ్ళలో కలిసిపోనా
మైకం ఒకింత మైకం…బిడియం రవంత బిడియం
చినుకుగా మారిపోనా…నీ గుండెపై చేరిపోనా
కరిగిపొమ్మంది ఒక చినుకు
కలిసి పొమ్మంది ఒక మెరుపు
చరణం: 2
తడిసే చకోరి సొగసు… పొంగే పదారు వయసు
నా పెదవి కోరుతోంది… తొలి ముద్దు కోరుతోంది
రానీ ముహూర్త సమయం …కలలే ఫలించు తరుణం
వలపే నివాళి చేసి …నిలువెల్ల అల్లుకోనా
కరిగిపొమ్మంది ఒక చినుకు…
కలిసి పొమ్మంది ఒక మెరుపు…