మోహన రాగం… లిరిక్స్
చిత్రం: ధర్మ పోరాటం (1983)
సంగీతం: సత్యం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, పి. సుశీల
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ
దర్శకత్వం: బోయన సుబ్బారావు
నిర్మాత:మంచు మోహన్ బాబు
విడుదల తేది: 1983
మోహన రాగం పొంగెను యెదలో..
మువ్వల నాదం మ్రోగెను లయలో..
సురుచిర శృతిలో.. సుస్వర జతిలో..
సుకుమార భావాలలో…
మోహన రాగం పొంగెను యెదలో..
మువ్వల నాదం మ్రోగెను లయలో..
సురుచిర శృతిలో.. సుస్వర జతిలో..
సుకుమార భావాలలో…
నీ హృదయ బృందావనిలో…
నీ ప్రణయ యమునా తటిలో…
నీ హృదయ బృందావనిలో…
నీ ప్రణయ యమునా తటిలో…
మన రాసక్రీడా విలాసాలలో…
పొదలలో… పూలలో…
పెదవిలో… మధువులో…
పగలు రేయి మరచిపోవు దశలో
నవరసాల అనుభవాల జడిలో
మోహన రాగం పొంగెను యెదలో..
మువ్వల నాదం మ్రోగెను లయలో..
నీ నయన నయగారములో…
నీ సరస శృంగారములో…
నీ నయన నయగారములో…
నీ సరస శృంగారములో…
ఎడబాటులే లేని మన ప్రేమలో..
ఎండలో… వానలో…
కలిమిలో… లేమిలో…
కలిసిపోయి కరిగిపోవు మనలో..
ఎవరు ఎవరో తెలియరాని స్థితిలో..
మోహన రాగం పొంగెను యెదలో..
మువ్వల నాదం మ్రోగెను లయలో..
సురుచిర శృతిలో.. సుస్వర జతిలో..
సుకుమార భావాలలో…
dhan dhana dhana danaare folk song lirics ivvandi. ee paata chalaa baagundi.
dhan dhana dhana danaare folk song lirics ivvandi. ee paata chalaa baagundi.
sure