Dharmaatmudu (1983)

చిత్రం: ధర్మాత్ముడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ
దర్శకత్వం: బైరిశెట్టి భాస్కరరావు
నిర్మాత: కె.కేశవరావు
విడుదల తేది: 1983

ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో

ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో…

ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో

 సొగసే నీ అలకలు కూడా
సొగసే ఓ ముద్దుల గుమ్మా
ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే…
తెలుసే ఇది రోజూ ఉండే వరసే
చిరు చీకటి పడితే.. కౌగిట చేరగ తపించి తపించి పోతావే?
 న్యాయము కాదిది.. సమయము కాదిది..
న్యాయము కాదిది.. సమయము కాదిది..

గోపెమ్మో ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో…
 ఓ కిష్టయ్యో రాను పోవయ్యో

మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే
ఎదలో కోరిక కలుక్కు కలుక్కు మంటుంటే…
ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ
మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే
 నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి?
నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి?

గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో..ఊ..
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో

ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో…
ఈ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో…
ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో
ఓ గోపెమ్మో.. రాను పో…వయ్యో…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Pelli Sandadi (1959)
error: Content is protected !!