చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 23.06.2017
రక్షాపధాన శిక్షాధికార – ధీక్షా నిరీక్శుడెవరూ
ఉగ్రప్రతాప వ్యఘ్రప్రకోప – ఖడ్గప్రహారి ఎవడూ
శూలాయుధాత కాలాంతకాంత – జ్వాలా త్రినేత్రుడెవడూ
విధ్వంసకార పృధ్వీతలాన – అభయకరుడు అతడెవడూ
డీజే …డీజే డీజే డీజే
డీజే …డీజే డీజే డీజే
డీజే … శరణం భజే భజే
డీజే … శరణం భజే భజే
ఓ…ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ
చరణం: 1
లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై – లక్ష్యభేదనం చేయ్.రా
భద్రమూర్తివై విద్రోహులపై – రుద్రతాండవం చెయ్.రా
ఉగ్రతురంతం ధగ్దం చేసే – అగ్ని క్షిపణివై రారా
ఎచటెచటెచటే కీచకుడున్నా – అచటచటచటే పొడిచెయ్.రా
డీజే …డీజే డీజే డీజే
డీజే …డీజే డీజే డీజే
డీజే … శరణం భజే భజే
డీజే … శరణం భజే భజే
జై జై శక్తిలిడు సిద్దిగణపతీ జై హో
సై సై నట్టువాంగముల నాట్యగణపతీ సాహో
విఘ్ణరాజ నీ విభ్రమనర్తల వీధి వీధిలో ధిల్లానా
కుమ్మరించవా భక్తులపైన వరాల జల్లుల వా..నా
చరణం: 2
నిత్యం నృసిమ్హతత్వం వహించి – ప్రత్యర్ధి పైకి రారా
సత్యం గ్రహించి ధర్మం ధరించి – న్యాయం జయించనీరా
చెడిన పుడమిపై యువక యముడివై – చెడుగుడాటుటకు రారా
లోకకంఠకుల గుండెలు అదిరే – మ్రుత్యుఘంట నువేరా
డీజే …డీజే డీజే డీజే
డీజే …డీజే డీజే డీజే
డీజే … శరణం భజే భజే
డీజే … శరణం భజే భజే
ఓ…ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ
డీజే …డీజే
********* ********* *********