Doctor Chakravarty (1964)

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 10.07.1964

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది…ఆ…

నీవు లేక వీణ

జాజి పూలు నీకై  రోజు రోజు పూచె
చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై  తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసన లేవని అలుకలుబోయె

నీవు లేక వీణ

కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కదలలేని కాలం విరహ గీతి రీతి
కదలలేని కాలం విరహ గీతి రీతి
పరువము వృధగా బరువుగ సాగే

నీవు లేక వీణ

తలపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులెన్నో మదిలో దాచి వేచినాను
తాపమింక నేను  ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని  కరుణను యేలగ రావా

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది…ఆ…
నీవు లేక వీణా…ఆ…

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది…

కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కరుణలేని కాలం కసరి కాటువేసే
బ్రతుకే రగిలే చితియై పోయే

నీవు లేక వీణ

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

ఈ మౌనం ఈ బిడియం
ఇదేనా ఇదేనా చెలియ కానుక.
ఈ మౌనం ఈ బిడియం
ఇదేలే ఇదేలే మగువ కానుక
ఇన్నినాల్ళ మన వలపులు
వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె
అల్లుకొనెడి మాలిక

మాటలలో తెలుప లేదు
మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు
ప్రణయ భావ గీతిక

ఏకాంతము దొరికినంత
ఎడమోమా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే
అంత తీపి కలయిక

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

మనసున మనసై..బ్రతుకున బ్రతుకై
మనసున మనసై..బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..

మనసున మనసై..బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..

ఆశలు తీరని ఆవేశములో..ఆశయాలలో..ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..

అరె!  ఎప్పుడొచ్చారు?
మీకు తపోభంగము కలిగించామా?
లేదు నా తపస్సుకి మెచ్చీ ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు.
మరి ఆపేశావేం..పాడు.
ఆది దంపతులే అడుగుతుంటే కాదనగలనా..మాధవీ దేవి గారు,మీకు అభ్యంతరం లేకుంటే
కాదనకండి.బ్రతిమాలించుకోవాలా! ఊ..

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము..

చెలిమియె కరువై..వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే

తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము..

మనసున మనసై..బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పాడమని నన్న డగవలెనా –
పరవశించి పాడనా
నేనే  పరవశించి పాడనా        

నీవు పెంచిన హృదయమే
ఇది – నీవు నేర్పిన గానమే…  

నీకు గాక ఎవరి కొరకు
నీవు వింటే చాలు నాకు      

చిన్న నాటి ఆశలే
ఈనాడు పూచెను పూవులై
చిన్న నాటి ఆశలే
ఈనాడు పూచెను పూవులై

ఆ పూవులన్నీ మాటలై
వినిపించు నీకు మాటలై    

ఈ వీణ మ్రోగక ఆగినా
నే పాడజాలక పోయినా
ఈ వీణ మ్రోగక ఆగినా
నే పాడజాలక పోయినా
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ    

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.జానకి. పి.బి.శ్రీనివాస్

ఒంటిగ సమయం చిక్కిందీ ! కంటికి నిద్దుర రానంది !
మనకూ మనకూ ఇనుప గోడవలె ! తడిక అడ్దమై కూచుంది !
ఒంటి గ సమయం చిక్కిందా ! కంటికి నిద్దుర రానందా !
మనకూ మనకూ మనసులు కలిసిన ! తడిక అడ్దమై కూచుందా !
ఇంటింటా ఒక ముసలి ఘటం ప్రేమికులకు ఆది పెనుభూతం
కదిలితే భయం మెదిలితే భయం
ఎన్నా ల్లో ఈ ఇరకాటం

    ||ఒంటిగ ||

పెద్ద తలొక్కిటి ఉంటేనే హద్దు పద్డులో ఉంటాము
ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే
పార్కులో మళ్లీ సరిగమ లే       ||ఒంటిగ ||

ఎటుల భ రింతును ఈ విరహం ఒట్టి చూపులతో ఏమి ఫలం !
అమ్మ వచ్చినా అరచి చచ్చినా
విడువ లేను ఈ అవకాశం        ||ఒంటిగ ||
గుట్టుగ సాగే సరసాన్ని రట్టు చేయకోయి నాసామీ
తడిక దాటినా దుడుకు చేసినా, తప్పదు మనకు తదిగిణతోం
అమ్మ చేతిలో తదిగిణతోం

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: మాధవపెద్ది సత్యం,  పి. సుశీల

ఓ ఉంగరాల ముంగురుల రాజా !
నీ హంగు జూసి పొంగిపోను లేరా !
నా సామిరంగ దణ్ణ వోయీ !
నా జోలికింకా రాకోయీ !
ఓ సిన్నోడా !  ఓ సిన్నోడా !  ఓ సిన్నోడా !
ఓ బొంగరాల బుగ్గలున్నదానా!
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా !
నువ్ కస్సుమంటే తాళ లేనే !
నీ పొందుగోరి వచ్చినానే !
ఓ చెలియ !  ఓ చెలియ !  ఓ చెలియ !
నీ కైపు కళ్ళతో – నీ కొంటె  నవ్వుతో
గారడీ చేశావు
నీ తీపి మాటలు – నీళ్ళలో మూటలు
నిన్నింక నమ్మనోయీ !

నా సిలకా… ఓయ్ నీ అలకా.. ఓయ్
తెచ్చింది లే అందం – నా కళ్ళు చూడవె
నీ బొమ్మ ఆడెనే – మనసంత నీవేనే
పో పోవోయ్
ఓ పిల్లొయ్
కిల్లాడీ చాలులే  

||ఉంగరాల||

ముచ్చట్లు గాలితో.. మురిపాలు పూలతో
నటనలు నాతోనా ?
సరసాలు సుక్కతో.. సరదాలు మబ్బుతో
సయ్యాట నాతోనా ?
ఇటు సూడవే – ఓయ్ – నీ తోడులే – ఓయ్
దాసుడు నీవాడే – ఓయ్ – నువ్వుంటే పక్కన
మనసేంతో చల్లన- నా రాణి నీవేనే
ఓ రాజా
నా రోజా
ఈ రోజే హాయ్.. హాయ్.. హాయ్..
 || బొంగ||

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

పాడమని నన్నడుగతగునా
పదుగురెదుటా పాడనా
కృష్ణా ! పదుగురెదుటా పాడనా !

పాడమని నన్నడుగతగునా
పదుగురెదుటా పాడనా
కృష్ణా ! పదుగురెదుటా పాడనా !

పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణు గానము
పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణు గానము
ఒలక బోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి

పాడమని నన్నడుగతగునా
పదుగురెదుటా పాడనా

చిలిపి అల్లరి తెలిసినంతగ
వలపు తెలియని గోపకాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ
వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరీ వెచ్చనీ హృదయాల పొంగెను మధురగీతి

పాడమని నన్నడుగతగునా
పదుగురెదుటా పాడనా

ఎవరు లేనీ యమునాతటినీ
ఎక్కడో ఏకాంతమందున
ఎవరు లేనీ యమునాతటినీ
ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై
నేను నీవై నీవు నేనై  పరవశించే  ప్రణయ గీతి

పాడమని నన్నడుగతగునా
పదుగురెదుటా పాడనా
కృష్ణా ! పదుగురెదుటా పాడనా !

********  ********  ********

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల, బి.వసంత

నిజం చెప్పవే పిల్లా, ఎలాగుంది ఈ వేలా
నీ కెలాగుంది ఈ వేలా
నిజం చెప్పవే పిల్లా, ఎలాగుంది ఈ వేలా
నీ కెలాగుంది ఈ వేలా
ఏది చూచినా ఏమి చేసినా ఎదొగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా భలేగుంది ఈ వేలా
అహ భలేగుంది ఈ వేలా

చిలిపి వయసు కవ్వించె మనసు చిలికి మురిపించె
చిలిపి వయసు కవ్వించె మనసు చిలికి మురిపించె
నీలి కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
నీలి కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
సంబరాలతో సరాగాలతో సాగిపోదుమా…

నిజం చెప్పవే పిల్లా, ఎలాగుంది ఈ వేలా
నీ కెలాగుంది ఈ వేలా

నాలో వెలిగే దీపం  నీ చిరునవ్వు చిందే రూపం
నాలో వెలిగే దీపం  నీ చిరునవ్వు చిందే రూపం
నీ కాంతిలో ఈ శాంతిలో ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం

నిన్నలేని పులకింత కన్నెపిల్లకో వింత
నిన్నలేని పులకింత కన్నెపిల్లకో వింత
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేశనే
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేశనే
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే మాకు తెలుపులేవే

నిజం చెప్పవే పిల్లా, ఎలాగుంది ఈ వేలా
నీ కెలాగుంది ఈ వేలా

రాగం భావం నీవే నా అనురాగ గీతం నీవే
రాగం భావం నీవే నా అనురాగ గీతం నీవే
నీ ప్రేమలో నే లీనమై జీవించుటే స్వర్గమూ
రాగం భావం నీవే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Iddaru Dongalu (1984)
error: Content is protected !!