చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: వేటూరి
గానం: మాలతి, శంకర్ మహదేవన్
నటీనటులు: మంచు మనోజ్, సదా
దర్శకత్వం: సుబ్రమణ్యం శివ
నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 06.08.2004
రాజా రాజా నా మన్మధరాజా
నీకై వేచిన రోజా వడిలో చేర్చుకో రాజా
మన్మధరాజా మన్మధరాజా
కన్నె మనసే గిల్లోద్దు
దోపిడి చేసే చూపులతోటి
చుట్టు కొలతే చూడొద్దు
నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు
నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొట్టొద్దు
మన్మధరాజా నా మన్మధరాజా
హేయ్ మన్మధరాజా మన్మధరాజా
పొగరుమీద ఉన్నాడే
వన్నెలు చూసి కన్నులు వేసి
పిచ్చి ముదిరి వచ్చాడే
నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే
నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొడతాడే
మన్మధరాజా మన్మధరాజా
హే జిల హే జిల హే జిలకచిక జిల
హే జిల హే జిల హే జిలకచిక జిల
నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచ్చోడ్ని చేసి
పాప నీ వెంట తిప్పావే తిప్పావే తిప్పావే
రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లార్లు బట్టి
బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే
నీ నోరంటుకుంటే మిద్దులకిష్టం
నీ చీరంటుకుంటే సిగ్గులకష్టం
హే నాచాప కింద నీరైనావు
నన్ను ఆ నీటి చేపై ముద్దాడావు
నీ సోగసంత చాపల్లె పరిచేస్తాలే
నీ వయసంత వాటేసి మురిపిస్తాలే
కొత్త అందాల మత్తుల్లో కులుకేస్తాలే
హే రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా (2)
హే తన హే నన హే నన నన ననన
తన హే తనన హే తన నన నన ననననన
నా మనసే అడగవచ్చి
నీ వయసే ముడుపులిచ్చి
నా వంటి గంట కొట్టావే కొట్టావే కొట్టావే
నా పైట జారనిచ్చి చూసావే గుచ్చి గుచ్చి
సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే
పచ్చి పాలల్లే నేను విరిగానమ్మో
పాల పొంగటి నిన్ను మరిగానమ్మో
జిన్ను ముక్కంటి బుగ్గే జుర్రేశావు
చమ్మచక్కాడి నన్నే చంపేసావు
హే నాకోసం రాతిరి రాసిచ్చావు
తొలి కూతేసే కోడిని కోసేసావు
ఆ రంగేలి రంభల్లే రంకేశావు
హే రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా
రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా
హే మన్మధరాజా మన్మధరాజా
కన్నె మనసు గిల్లోద్దు
వన్నెలు చూసి కన్నులు వేసి
పిచ్చి ముదిరి వచ్చానే
నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు
నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొడతానే
మన్మధరాజా – నీ మన్మధరాజా
మన్మధరాజా నా మన్మధరాజా
కన్నె మనసే గిల్లోద్దు
దోపిడి చేసే చూపులతోటి
నన్ను గిచ్చి చెంపేయ్ రా…