చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: కె.వి.రెడ్డి
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 01.10.1955
అనురాగం విరిసేనా …. ఓ…. రేరాజా
అనుతాపము తీరేనా!
వినువీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసానా ? “అను”
నిలిచేవు మెయిలు మాటున
పిలిచేవు కనుల గీటునా!
పులకించు నాధుడెందము
ఏనాటి ప్రేమబంధమో! ఓ…రేరాజా…. “అను”
మనసుసాగే మొహాలేమో
వెనుకాడే సందేహాలేమో “మునుసాగే”
నీ మనసేమో తేటగా
తెనిగించవయ్యా మహారాజా….ఓ…రేరాజా “అనూ
******** ********* ********
చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కీ (పి.జి.కృష్ణకుమారి)
లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదుర లేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా
పొడిచింది చందమామ…
చేరి పిలిచింది వయ్యారి భామా (2)
కురిసింది వెన్నెల వానా,,,,
ఆహా ….విరిసింది పన్నీటీ వాసన “లేవోయ్ “
కన్నుల్లో కళమూసె నేల (2)
వెత చెంది సుఖపడలేవురా ….
నీ బతుకల్లా కలయైపోవురా…. “లేవోయ్”
నిన్న కలసి మొన్న లోన
మొన్న నేడు రేపు సున్న (2)
ఉన్ననాడే మేలుకో
నీ తనీవి తీరా ఏలుకో “లేవోయ్ “
*********** ************ ***********
చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కీ (పి.జి.కృష్ణకుమారి)
అంద చందాల సొగసరివాడు (2)
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ… ఓహో చందమామ
చందమామ… ఓహో చందమామ
చందమామ… ఓహో చందమామ ఓఓఓ…
ఓ..ఓ..ఓ… చూడచూడంగ మనసగువాడు
ఈడు జోడైన వలపుల రేడు
ఊ..వాడు నీకన్నా సోకైన వాడు…
విందు భోంచేయ వస్తాడు నేడు “చందమామ”
ఓ..ఓ..ఓ వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు
వాని నవుల్లో ముత్యాలు రాలు
ఊ… వాడు నీకన్నా చల్లనివాడు
విందు భోంచేయవస్తాడు నేడు….”చందమామ”
ఓ..ఓ..ఓ నేటి పోటీల గడుసరివాడు
మాటపాటించు మగసిరివాడు
ఊ… వాడు నీకన్నా సిరిగలవాడు….
విందు భోంచేయ వస్తాడు నేడు…. .”చందమామ”
*********** ********** ***********
చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల, జిక్కీ (పి.జి.కృష్ణకుమారి)
అ: ఓ…చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మ
ఆ: ఓ…మరుమల్లెలలో మావయ్యా
మంచి మాట సెలవీవయ్యా
అ: పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా “ఓ చిగురాకులలో”
ఆ: ఎవరన్నారో ఈ మాట
వింటున్నాను ఈ మాట
తెలిసీ పలికిన విలువేనా “ఓ… మరుమల్లెలో”
అ: వలచే కోమలి వయ్యారాలకు
తలచే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ “ఓ…చిగురాకులలో”
ఆ: పైమెరుగులకే భ్రమపడకయ్యా
మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా “ఓ…మరుమల్లెలలో”
*********** ************ ***********
చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల
భలే తాత మన బాపూజీ – బాలల తాతా బాపూజీ (2)
బోసి నవ్వుల బాపూజీ – చిన్నీ పిలక బాపూజీ “భలే”
కులమత బేధం వలదన్నడు – కలిసి బతికితే బలమన్నడు
మానవులంతా ఒకటన్నాడు – మనలో జీవం పోశాడు “భలే”
నడుం బిగించి లేచాడు – అడుగు ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ – దేశం దేశం కదిలింది!
గజగలలాడెను సామ్రాజ్యం –
మనకు లభించెను స్వారాజ్యం! (2)
సత్యా హింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం వోధించాడు (2)
మహాత్ముడై ఇలవెలిశాడు “భలే”
*********** ************ ***********
చిత్రం: దొంగ రాముడు (1955)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కీ (పి.జి.కృష్ణకుమారి), మద్దాలి క్రిష్ణ మూర్తి
రావోయి మా ఇంటికి – మావో
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి – మావో
మాటున్నది మంచి మాటున్నది
నువ్వునుంచుంటె నిమ్మ చెట్టు నీడున్నది
నువ్వు కూసుంటె కురిసీల సీటున్నది
నువ్వు తొంగుంటె పట్టెమంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
ఆకలైతే సన్న బియ్యం కూడున్నది
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరన్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నది
మాటున్నది మంచి మాటున్నది
రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమోస్తే ఘాటైన మందున్నది (2)
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది
మాటున్నది మంచి మాటున్నది