చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు (All)
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: బాలకృష్ణ , రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 11.02.1988
పల్లవి:
చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు
పెళ్లి చుక్క పెట్టినట్టు
వెన్నెలంత ఉంగచేసి వేచివున్న వేళలో
వేగుచుక్క పక్కకొచ్చి ఆకువక్కలందుకో హోయ్
సోకులన్ని కట్టబెట్టు చిలకచుట్టి పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దులతో సంకురాత్రి ముగ్గుపెట్టు
చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్
చరణం: 1
నవ్వుతూ చేరుకోవే చల్లగాలి తాకినట్టు
కులుకుతూ దరికిరావే రాజహంస నడిచినట్టు
మెల్లగా అల్లుకోరా పట్టుచీర నేసినట్టు
లేతనడుము తిప్పుకోరా తోడుపెరుగు చిలికినట్టు
మల్లెపూలు స్వాగతాలు ఇచ్చినట్టు
చాటునుంచి నన్నుచూసి కన్నుకొట్టు
సానమీద గందమరగదీసినట్టు
చెయ్యివేసి ఒంటివేడి వదలగొట్టు
వీడిపోని జట్టుకట్టు – పాలుతేనె కలిసినట్టు
చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు
పెళ్లి చుక్క పెట్టినట్టు
అరె చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్
చరణం: 2
చెక్కిలి గిలిపెట్టు వలపు వీణ మీటినట్టు
చూడబోకు గుచ్చినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
సరసమంత చూపేట్టు వానజల్లు కురిసినట్టు
ముచ్చటించి రెచ్చగొట్టు పచ్చిపాలు కాచినట్టు
చిలికి చిలికి వెన్నపూస తీసినట్టు
మెరుపు తీగ సొంపులన్ని వడిసిపట్టు
పూలతేనె బొట్టు బొట్టు రాలినట్టు
లేత లేత పెదవితోటి ముద్దులెట్టు
కౌగిలింత చాలినట్టు
కట్టిపెట్టు కన్నెబెట్టు
చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు
పెళ్లి చుక్క పెట్టినట్టు
వెన్నెలంత ఉంగచేసి వేచివున్న వేళలో
వేగుచుక్క పక్కకొచ్చి ఆకువక్క లందుకో
సోకులన్ని కట్టబెట్టు చిలకచుట్టి పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దులతో సంకురాత్రి ముగ్గుపెట్టు
చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్