Donga Ramudu And Party (2003)

చిత్రం: దొంగరాముడు అండ్ పార్టీ (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: తనికెళ్ళ శంకర్
గానం: శ్రీనివాస్ , సుజాత
నటీనటులు: శ్రీకాంత్, లయ, భువనేశ్వరి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: యమ్. ఎల్.కుమార్ చౌదరి
విడుదల తేది: 26.06.2003

పల్లవి:
చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా
బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని
ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ
ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగా
గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే
ప్రాణమైన ప్రేమా మన ప్రేమా
హాయి పేరు ప్రేమా మన ప్రేమా
చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా

చరణం: 1
పరువాల తెర తీసే చొరవే దొరికేనా
క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోనా
హృదయాలే వెలిగించే గుణమే ఈ ప్రేమ
విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన
గాలైనా రాకుండా మన దారిలో
హాయేదో పెరిగింది మలిసందెలో
భారాలే తీరంగా మది లోపలా
గానాలే చేసింది ఎలకోయిల
నలువైపుల రాగాలే మధువొలికే
మేఘాలై వానవిల్లు విరిసే మరి విరిసే
తేనెజల్లు కురిసే మది కురిసే

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా

చరణం: 2
తనువుల్లో మనసుల్లో జ్వరమే ఈ ప్రేమ
చిగురేసి చైత్రంలా పెరిగే లోలోన
అరుదైన విలువైన చెలిమే ఈ ప్రేమ
తపియించే ఎదలోన చినుకై కురిసేనా
చుక్కలనే దాటించి అలవోకగా
ఎక్కడికో చేర్చేది వలపే కదా
మక్కువతో వేధించి ప్రతి జాములో
చెక్కిళ్ళు నిమిరేటి చలువే కదా
మునుపెరుగని మురిపాలు ముదిరాయి
సరదాలు పూలజల్లు ప్రేమా మన ప్రేమా
తీపి ముల్లు ప్రేమా ఈ ప్రేమా

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా
బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని
ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ
ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగా
గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే
ప్రాణమైన ప్రేమా మన ప్రేమా
హాయి పేరు ప్రేమా మన ప్రేమా
చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని
మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా

*******   ********   *******

చిత్రం: దొంగరాముడు అండ్ పార్టీ (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: యస్.పి.బాలు, సుజాత

పల్లవి:
ప్రెమే – పంచమి వెన్నెల
ప్రేమే – పంచమ కోయిల
ప్రేమే – మంచున మల్లిక
ప్రెమే – మన్మధ సంచిక
చక్కని చెక్కెలి నొక్కుల లోన
చిక్కిన చక్కని చుక్కని కానా
కన్నెలా – అల్లుకోనా
వెన్నెలే – జల్లు కోనా
నిన్నిలా – గిల్లు కోనా
నిన్న లా  – తుల్లి పోనా
లేని పోని వూహలన్ని ప్రేమలే సుమా

చరణం: 1
సుందరమా సుమధురమా
తొందరగా జత పడుమా
చిలిపి చిలిపి లిపి సంతకాలతో
వలపు తెలుపుటకు చెంత చేరుకో
కన్నే కొట్టేసి నేడు నన్నే చుట్టేసి చూడు
నిన్నే ఇచ్చేసే తోడు మగతనమా
పిలవడమా కలవడమా
ముద్దుల మీటిన నీ ప్రేమ
సరి హద్దులు దాటిన నీ ప్రేమా
నను నీలాగా నిను నాలాగా
పెన వేయు ప్రాయ మీ ప్రేమా
కలవరమా పరవసమా
రూపు లేని రేపు లోని
తీపి రేపు మధువనమా

చరణం: 2
అధరములే థొణకదమా
మధురిమలే తోనకదమా
తళుకు బేళూకలకు వందనాలుగా
చురుకు పునుకులకు చందనాలుగా
పచ్చ మొక్కన్తి సోకు
పచ్చ పూవన్టి రేకు
ఇట్టే నచ్చింది నాకు యవ్వనమా
సుముఖములో సుమ సరమా
ఇద్దరు లేరని ఈ ప్రేమా
మననొక్కటి చెసినదీ ప్రేమ
గత జన్మాలే శతమానాలై
ముడి వేయు ప్రాయ మీ ప్రేమ
కిల కిలలా కలరవమా
తూరుపింత దారి చూపు
వేకువంటి తొలి వరమా

error: Content is protected !!