చిత్రం: దొంగోడొచ్చాడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ రాధిక
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: పి.జనార్ధన రావు, జి.విజయలక్ష్మి
విడుదల తేది: 1987
పల్లవి:
మనిషి జీవితం చదరంగం
మనసు మమతల పద్మవ్యూహం
మనిషి జీవితం చదరంగం
మనసు మమతల పద్మవ్యూహం
అంతులేని అనురాగ యజ్ఞం
ప్రతిఫలమన్నది కోరని యాగం
రక్తబంధమే త్యాగ పునీతం
తీర్చినకొద్ది పెరిగే పాశం
ఇదే రక్తపాశం ఇదే రక్తపాశం
మనిషి జీవితం చదరంగం
మనసు మమతల పద్మవ్యూహం
చరణం: 1
తూరుపు కన్న సూర్యుణ్ణి నింగి పెంచుతుంది
నింగివిడిచిన సూర్యుణ్ణి పడమరే ఆదుకుంటుంది
రెండు దిక్కుల నడుమ నాటకం
వెలుగు నీడలే మనిషి జాతకం
మనిషి జీవితం క్షణమైనా
మమత ఒక్కటే శాశ్వతం
అనుబంధానికి నిలువుటద్దమే పెంచిన వారి మమకారం
పెంచిన వారి మమకారం
మనిషి జీవితం చదరంగం
మనసు మమతల పద్మవ్యూహం
చరణం: 2
కొడుకు దొంగగా చేరగా చేరదీసినమ్మా
దొంగ కొడుకుగా మారిన కడుపునే నమ్మనంటుంది
నిజానిజాలు నేల నీడలే
నేలకూలిన గాలిమేడలై
పావులైన ఈ జీవులలో
రాజు ఎవ్వరో బంటెవరో
మనిషి జన్మనే ఎత్తినప్పుడు మనసు చంపుకోనీకోసం
మనసు చంపుకోనీకోసం
మనిషి జీవితం చదరంగం
మనసు మమతల పద్మవ్యూహం
అంతులేని అనురాగ యజ్ఞం
ప్రతిఫలమన్నది కోరని యాగం
రక్తబంధమే త్యాగ పునీతం
తీర్చినకొద్ది పెరిగే పాశం
ఇదే రక్తపాశం ఇదే రక్తపాశం