చిత్రం: దొంగోడొచ్చాడు (2017)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: బాబీ సింహా, అమలా పాల్, ప్రసన్న
దర్శకత్వం: సుసి. గణేశన్
నిర్మాతలు: కల్పాతి ఎస్.అఘోరన్, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
విడుదల తేది: 2017
నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
నీ తలపే వలపై ఎదలో మలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ…
నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
యుగం క్షణం అనుక్షణం
జగం మనం నీ జతలో చెలియా
క్షణం యుగం అదే జగం
చెరో సగం నువులేక సఖియా
సిరివెన్నెల ఎండాయే
నా నీడే రెండాయే
కుదురన్నది లేదాయే కునుకన్నది రాదాయే
తడబడిపోతున్నా ఓ చెలి
నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
నా పల్లవే ఓ మల్లికై మెరిసిందీ చెలియా
ఆ పల్లవే ఓ వెల్లువై నా కళ్ళలో కురిసిందీ సఖియా
ఇదివరకు ఎరగంది ఈనాడే జరిగింది
నడి రాతిరి పగలైంది ఓ తీయని దిగులైంది
తడబడి పోతున్నా ఓ చెలి
నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
నీ తలపే వలపై ఎదలో మలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ…