చిత్రం: దొంగోడు (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, రిమ్మి టామి
నటీనటులు: రవితేజ ,కళ్యాణి , రేఖ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాతలు: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేది: 2003
పల్లవి:
కోడి ముందా గుద్దుముందా చెప్పుకోవే కొంటెపాప
కోకముందా రైకముందా చెప్పుకోవోయ్ చంటి బాబు
హే కోడి ఉంటే గుడ్డు ఉంది గుడ్డు ఉంటే కోడి ఉంది
రెండింటికి లింకే ఉందోయ్
కోక ఉంటే రైక ఉంది రైక ఉంటే కోక ఉంది
రెండిట్లో సోకే ఉందోయ్
కోడి ముందా గుద్దుముందా చెప్పుకోవే కొంటెపాప
కోకముందా రైకముందా చెప్పుకోవోయ్ చంటి బాబు
చరణం: 1
పాలలో పెరుగున్నదోయ్ నా పైటలో బరువున్నదోయ్
ఓ నూతిలో గిలకున్నదోయ్ నా చేతిలో మెళికున్నదోయ్
చిత్తూరు తోటలో చిలకమ్మ ఉన్నదోయ్
చీకట్లో చిచ్చు ఉందోయ్
ఓ ఒంగోలు సంతలో ఓట్లెద్దు ఉన్నదోయ్
నా ఒంట్లో ఊయలుందోయ్
నా నీటిలోన నువ్వు రొట్టివేసుకొని లొట్టలేసి తినవోయ్
నా ఛాతిపైన నువు సాపవేసుకొని రాతిరంత గడిపేయ్
కోడి ముందా…
కోడి ముందా గుద్దుముందా చెప్పుకోవే కొంటెపాప
హే కోకముందా రైకముందా చెప్పుకోవోయ్ చంటి బాబు
చరణం: 2
కొంపలో తలుపున్నదోయ్ నా సొంపులో పిలుపున్నదోయ్
కుండలో నీరున్నదోయ్ నా బండిలో జోరున్నదోయ్
జాడీలో పప్పులు హుండీలో డబ్బులు
బాడీలో వేడి ఉందోయ్
హే మీసంలో మెరుపులు గెడ్డంలో గరుకులు
మంచంలో మలుపులున్నాయ్
నా మాడిపండులోన ఉప్పునింపుకొని
ఊరగాయ చేసేయ్
నా నిమ్మపండు వంటి నువ్వు నిండి ఉన్న
గుండెకాయ దోచేయ్