Dookudu (2011)

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: రాహుల్ నంబియార్
నటీనటులు: మహేష్ బాబు, సమంత
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాతలు: రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 23.09.2011

పల్లవి:
గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్‌ ఫార్టీ
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి
నిదరే పోనందే నా కన్ను
గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్‌ఫార్టీ
తొలిసారిగ చూశానే నిన్ను

రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

చరణం: 1
నువ్వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే లవ్‌లో పడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగినేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

చరణం: 2
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం  నువ్వు ఐ లవ్ యూ
అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే
నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి
ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం

*******  *******  ******

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: ఎన్. ఎస్. రమ్య, నవీన్మాధవ్

పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పిపి నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు
చీ పాడు పోరగాళ్లంతా నా ఎనకే పడతారు
ఎందీ టెన్షను యమ్మా టెన్షను
హే మారుతీలో డ్రైవింగ్ నేరిపిస్తాననీ సైదులు
ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇత్తాననీ అబ్బులు
దొరికిందే సందంట తెగ టెన్షను పడతారు అందరూ
తింగ తింగ తింగరొళ్ళ టెన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు

హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెన్షను
హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెన్షను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్షను
పిల్లా పిల్లా దడ పిల్లా ఎందే నీకే టెన్షను
ఎడాపెడా దడబిడ ఏం జరుగుద్దనీ నీ టెన్షను
హే నచ్చిందే పిల్లానీ నలిపేత్తారనీ  టెన్షను
నలుసంత నడుముని గిల్లేత్తారని  టెన్షను
వోణి కొచ్చకే ఓమ్మో మొదలైనదే  టెన్షను
తింగ తింగ తింగరొళ్ళ టెన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను
మోనికా…
మోనికా…

హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
సూపర్ స్టార్ రేంజు ఉన్నోడికే పెడతా నేను టెండరు
హే అల్లాటప్పా ఫిగరు ఇచ్చేయందే నీకా పొగరు
చూపిస్తా నాలో పవరు పిండేస్తా నీలో చమరు
హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను
నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను
నీ దుడుకు దూకుడు ఏం సేత్తదో నని టెన్షను…
దూకు దూకు అరే దూకు దూకు
హే దూకు దూకు దూకుతావని టెన్షను
అరె దుమ్ము దుమ్ము లేపుతవని టెన్షను

*******  *******  ******

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: కార్తీక్ ,  రీటా

హే ఛుల్బులి నా ఛుల్బులి
నువు కోహినూరు లాంటి కొండమల్లి
నా ఛుల్బులి నా ఛుల్బులి
అందాల దాడి చేసినావే ఆడపులి హాయ్
మాటల్లో మత్తు చల్లి చల్లి
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ…
నువు దొరికిపోవే నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి…

చరణం: 1
పిట్టంత నడుమును ఎరవేశావే
పిల్లోడి నిదరను ఎగరేశావే
ఆకలి కళ్ల పోకిరిలాగ వదలక వెంట తిరిగావే
నాజూకు ఈటెలు గురిచూశావే
నేనెటూ కదలని గిరిగీస్తావే
కుదురంతా చెరిపేశావే చూపులతోన
చెక్కిలిమీటి చెకుముకి మంటేశావే
కనుసైగలతోనే కవ్వించావే చెలీ నన్ను రారమ్మనీ

మాటల్లో మత్తు చల్లి చల్లి
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ…
హే నువు దొరికిపోవే నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి లాలీ చలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి…

చరణం: 2
బాగ్దాద్ గజదొంగై నే రానా
ఏకంగా నిన్నే దోచుకుపోనా
కనుగొనలేని చిలకల దీవి
మలుపులలోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటైనా
ఎలాగో నీ సరసకు రాలేనా
వింటున్నా చూస్తూ వున్నా
నీ పదునైన మాటలలోని
తెగువకు పడిపోతున్నా
హే ఎన్నటికైన నువు నా కూనా
రానా రానా జతైపోనా

మాటల్లో మత్తు చల్లి చల్లి
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ…
నువు దొరికిపోవే నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి…

*******  *******  ******

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: దివ్య , రంజిత్

నీ స్టైలే చగస్…
నీ స్మైలే ఖల్లాస్…
నీ నడకే క్లాసు మాసు డాన్సే

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే… హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేసావ్
హే బటక్ బటక్ అని గుప్పెడు గుండెని
కొరుక్కోరుక్కుని నువ్ నమిలేసావ్
ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేక్ రే ఓ… ఓ… ఓ…
నీ తళుకు బెలుకు ఎహే సూపరే ఓ… ఓ… ఓ…
హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే…

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే…హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేసావ్

గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికే
మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
ఆది పడి పడి దొర్లెను చూడే
తేనే లాంటి పిల్లాడే వేలు పెట్టీ చూడకే
తిమ్మిరాగనందిలే ఒహు వాహు ఓ…
ఏం జరగనివ్వు  పర్లేదులే ఒహో…
హే నిన్నదాకా లొల్లి పెట్టీ  ఇప్పుడేంటే సుప్పనాతీ
ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి
ఓసి నా తల్లో…

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే… హే

పైనే బొట్టు ఉన్నది రేగిపోవడానికే
చీర కట్టు ఉన్నది జారి పోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిట కిట పరువం నీకే
ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే
గోడ దూకడానికే ఓ…ఓ…ఓ…
హే విధియ తధియలిక దేనికే  ఓ…ఓ…ఓ…
హే విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకో
ఒంపు సొంపులోనే ఉంది పాల ధార పంచదార
ఏతమేసెయ్ రో…

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే… హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేసావ్

నీ స్మైలే కల్లాస్…

*******  *******  ******

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: విశ్వ
గానం: శంకర్ మహాదేవన్

నీ దూకుడు… సాటెవ్వడూ…
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్‌మంటూ
కలయబడి కలకలమే రేపే
బినా యే భలా బురా సోచే
కమాన్ ఏవ్రిబడి లెట్స్ గో గో గో…
నీ దూకుడు… సాటెవ్వడూ…

చరణం: 1
విషపు ఊడ పడగలనే
నరికివేయి తక్షణమే
పనికిరాదు కనికరమే
అణచివేత అవసరమే
వదలినావు దురితులనే
ప్రళయమేరా క్షణక్షణమే
సమరమే సై ఇక చలగిక చకచకా
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
పిడికిలినే పిడుగులుగా కలబడనీ

నా దూకుడు… సాటెవ్వడూ…

చరణం: 2
గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెను పటిమే
పాదరస ఉరవడి నరనరమే
కర్ దిఖాయే జరా హఠ్‌కే
హోష్ ఉడాయే దుష్‌మన్‌కే
సమరమే చెయ్యిక చలా ఇక చకా చకా
ఎడతెగ చెయ్యిక విలయపు తై తక
చొరబడుతూ గురిపెడుతూ తలపడుతూ
నాననా నాననా నానానా (2)
కమాల్ హై ధమాల్ హై ఈ దూకుడు
ఝుకే నహీ రుకే నహీ ఈ దూకుడు

 హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే

నా దూకుడు… సాటెవ్వడూ…

*******  *******  ******

చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, శ్రీవర్ధిని, రానైనా రెడ్డి, మేఘా

జే జే జే జే జేజేలంది మా ఇంటి పెళ్లి కళ
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా
కలలే కలిపిన అనుబంధంగా
ఇలలో ఇపుడే సుముహూర్తంగా
ఎదురైయ్యింది చల్లని వేళ కల్యాణ లీలా

అదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు
అరే అరే అదరదర గొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ
హే మగపెళ్లివారమంతా వాలిపోయాం విడిదింట
పనిలో పని పళ్ళకిని మోసుకొచ్చేశామంట
మనువాడే శ్రీ మహాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంట
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా

అదర అదర ఆదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు
పిల్లొడే కట్నం ఇచ్చుకోక తప్పదు
హే హే మావాడు మెరుపు పోటీలేని గెలుపు
స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే
వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు
హే చూసేస్తున్నాడే వరుడు లాగ్గమెప్పుడన్నట్టు
ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గ లోగుట్టు
తాపీగా ఉన్నారండి తత్తర బిత్తర లేనట్టు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా

హే భూలోకమంతా వెతికి చూసుకున్నా
ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు
హే నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాది వీరుడు
మా నిండు చంద్రుడు
హే అన్ని తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా
ఆ అలాంటి రామచంద్రుడు  నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు
నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు

ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా

అదర ఆదర  ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

Show Comments (13)

Your email address will not be published.