చిత్రం: డ్రైవర్ రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి. సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జయసుధ, రోజారమణి, జయమాలిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 02.02.1979
ఏమని వర్ణించను…
ఏమని వర్ణించను నీ కంటి వెలుగును
వెన్నంటి మనసును వెన్నెల నవ్వును
నీ ఇలవేల్పును ఏమని వర్ణించను…
చరణం: 1
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమని వర్ణించను…
ఆ…ఆ…ఆ..ఆ…
చరణం: 2
రాముడు కాడమ్మా నిందలు నమ్మడు
కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
ఏమని వర్ణించను…
ఆ…ఆ…ఆ..ఆ…
చరణం: 3
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించను నా అన్న రూపును
నాకున్న వెలుగును వెన్నంటి మనసును
నా ఇలవేల్పును ఏమని ఊహించను…
super