చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు, వాణిశ్రీ
దర్శకత్వం & నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 13.01.1971
అరెరెరెరె… ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
ఆర్ని… ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
అరెరెరెరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
ఓరినీ… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే
మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే
పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే
నువు తానాలు ఆడేవు… ఓలమ్మీ
నా పాణాలు తీశావే చిన్నమ్మీ
అరెరెరెరె… ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
అరెరెరెరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నే నొకటొకటే చూశాను
మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నే నొకటొకటే చూశాను
జడ చూస్తి… ఊ… మెడ చూస్తి… ఆహా
జబ్బల నునుపు చూస్తి… హా
కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ
కసి కసిగా చూస్తినే చిన్నమ్మీ
అరెరెరెరె… ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
అరెరెరెరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
తడిసి నీ తెల్ల కోక తప తపా మన్నది
తడబడినా నా గడుసు మనసు దడా దడా మన్నది
ఓరి నీ…
తడిసి నీ తెల్ల కోక తప తపా మన్నది
తడబడినా నా గడుసు మనసు దడా దడా మన్నది
కళ్ళుమూసుకొస్తినని గొల్లున నువు నవ్వితే
చురకల్లె తగిలింది ఓలమ్మి_
ఉడుక్కెక్కి పొయిందే చిన్నమ్మీ
అరెరెరెరె… ఏట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
అరెరెరెరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
స్వార్ధమే తాండవించు యీ జగతిలోన
మంచి ఇంకనుకలదని మనకు తెలుప
చెలిమి కోసమే త్యాగమ్ము చేసి యిచట
విశ్రమించిన దొక్క పవిత్ర మూర్తి !
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వర రావు
ఓ… మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా
అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో…
ఓ… మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా
అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో…
గట్టులు కొట్టి పొలం కలుపుకుంటాడు
ఒక బుల్లెయ్యా…
పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడు
ఒక ఎల్లయ్యా…
గట్టులు కొట్టి పొలం కలుపుకుంటాడు
ఈ బుల్లెయ్యా…
పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడు
ఒక ఎల్లయ్యా…
ఓ… చిన్నవాళ్ల రెక్కల కష్టం యిక్కడ దోస్తాడు…
ఓ హో హో హో…
ఆ బుల్లయ్యే… పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ యిస్తాడు
కోరస్: బుల్లెయ్యా…అక్కడ యిస్తాడు…
పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ యిస్తాడు
కోరస్: బుల్లెయ్యా…అక్కడ యిస్తాడు…
ఓ… మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా
అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో…
ప్రతి ఒకడూ తినమరిగినవాడూ…
ప్రజల పేరే చెబుతూంటాడు
వహ… వ… వహ… వ… వారేవా…
నిలదీసి… నీ ప్రజలెవరంటే నిన్నూ కాస్త తినమంటాడు
దొంగలు దొంగలు
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై పోతుంటే
వాటా దొరకని వాడు వేరే పార్టీ పెడతాడు…
ఓ అసలు పార్టీ నాదీ నాదని వాళ్ళల్లరి పడుతూంటే…
గోడమీద పిల్లిలాగ బుల్లెయ్యుంటాడు
అహ! కొట్టుకు తింటాడు
హేయ్ గోడమీద పిల్లిలాగ బుల్లెయ్యుంటాడు
అహ! కొట్టుకు తింటాడు
కోరస్: హెయ్… హెయ్…హెయ్
లింగం మింగిన బుల్లెయ్యా గుడిని మింగేదెపుడయ్యా?
కోరస్: మింగ్… మింగ్… మింగ్…మింగ్…
లింగం మింగిన బుల్లెయ్యా గుడిని మింగేదెపుడయ్యా?
కోరస్: మింగ్… మింగ్… మింగ్…మింగ్…
గుడిని లింగాన్ని గుటుకున మింగే
మొనగాడే నీ మొగుడయ్యా
అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో…
ఓ… మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా
అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో…
క… క… క… క… కల్లయ్యా
కోరస్: బు… బు… బు… బు… బుల్లెయ్యా
కల్లయ్యా… బుల్లెయ్యా
కల్లయ్యా… బుల్లెయ్యా
కల్లబొల్లి… బుల్లెయ్యా … ళూళూ… ఇయ్య…
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల, యస్. జానకి
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే కొంప ముంచుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్ది నీళ్ళైన చల్లలా తాగుతాడే
అహ సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్ది నీళ్ళైన చల్లలా తాగుతాడే
వెన్న ముద్దకని వెనకెనక వస్తాడే
వెన్న ముద్దకని వెనకెనక వస్తాడే
అమ్మాయిలు: వచ్చాడే… వచ్చాడే… వచ్చాడే…
అబ్బాయిలు: యిచ్చాడే… యిచ్చాడే…యిచ్చాడే
వెచ్చంగ ఒకటిచ్చి వెక్కిరించి పోతాడే
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
నెమలి ఈక పెట్టవే
అబ్బాయిలు: డుడుం… డుడుం… డుం
మురళి చేతికివ్వవే
అమ్మాయిలు: చించాం… చిం చాం…
నెమలి ఈక పెట్టవే
అబ్బాయిలు: డుడుం… డుడుం… డుం
మురళి చేతికివ్వవే
అమ్మాయిలు: చించాం… చిం చాం…
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
వదలగొడతాడు తుప్పులూ
చూడు… చూడు… చూడవే…
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఆ ముద్దు కృష్ణుడే యీ మొద్దు గుమ్మడే
ఆల మంద ఎక్కడే కోతిమూక వున్నదే
ఆ ముద్దు కృష్ణుడే యీ మొద్దు గుమ్మడే
ఆల మంద ఎక్కడే కోతిమూక వున్నదే
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరు?
మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరు?
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరు?
మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరు?
నువ్వా నా ముద్దుగుమ్మా? – ఆ
అయితే ఓ ముద్దు యిమ్మా – ఆహా…
నువ్వా నా ముద్దుగుమ్మా? – ఆ
అయితే ఓ ముద్దు యిమ్మా – ఆహా…
ఇవ్వనా ఇవ్వనా? ఇచ్చింది చాలునా?
ఓ హో హో కృష్ణుడూ ఓ ముద్దు గుమ్మడూ
నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే
ఓలమ్మి… చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే కొంప ముంచుతాడే
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వర రావు
ఓ… మల్లయ్యగారి ఎల్లయ్యగారి…బుల్లెమ్మా
బుల్లెయ్యగారి చెల్లెమ్మా…
నీ పురాణమంతా బుర్ర కధగా చెబుతామమ్మా…
వినరా… బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా…
బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
కోరస్: తందానా…తాన…
పిల్లికి బిచ్చం పెట్టని తల్లి
కోరస్: బుల్లెమ్మా
ఎంగిలి చేత్తో కాకిని తోలని
కొరస్: బుల్లెమ్మా
తవుడూ, చిట్టూ ధాన్యం, గీన్యం ఊళ్ళో అమ్మీ
పాలు, పెరుగు, వెన్నా, నెయ్యి బస్తీ కమ్మీ
కడుగు నీళ్ళే మొగుడి ముఖాన కొడతావమ్మా
అయ్యో…
కడుపు కట్టి… మూటలు కట్టి దాసావమ్మా…
కోరస్: దాస్తావమ్మా
చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
పాతివ్రత్యమే పారాయణము
పచ్చడి మెతుకులె బర్తకు దినము
పిల్లా మేకా లేరు కదమ్మా….యీ పిసినిగొట్టు బ్రతుకేం ఖర్మా… నీ ఖర్మా…
హేయ్…వినరా…
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోవని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని
పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని
పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని
దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
ఇంక ఒంటరిగా వున్న వాళ్ళు జంటలైపొవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ
చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ
కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ
చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ
వూసులన్నీ వింటివా వూరుకోవవి
ఆశలై, బాసలై అంటుకొంటవి
వూసులన్నీ వింటివా వూరుకోవవి
ఆశలై, బాసలై అంటుకొంటవి
హే పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వలపులోనె రెండిటి ఒద్దికున్నది
వలపులోనె రెండిటి ఒద్దికున్నది
హే పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని
గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని
గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని
గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని
అహా పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
ఆఁ కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
వెళ్ళిపోతున్నావా… అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా?
వెళ్ళిపోతున్నావా… అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా?
నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే
ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే…
అమ్మా, ఏమై పోవాలి…? నేనెలా బ్రతకాలి…?
||వెళ్ళిపోతున్నావా||
పంపకాలే తలవంపులనీ రెండు యిళ్ళను కలుపుతాననీ
పెంపకమిచ్చారానాడు ఆ దత్తే నేడు నా దేవుళ్ళను
నడివీధికీ లాగిందమ్మా నవ్వుల పాలు చేసిందమ్మా
||వెళ్ళిపోతున్నావా||
ప్రాణం దేహం విడిపోతున్నవి పాలమనసూ కన్నీరైనది
ఎవరో పెట్టిన అనలం రగిలీ యిందరి మమతలు బలికోరినదీ
అమ్మా ఏమై పోవాలి నేనింకెలా బ్రతకాలి
ఇంకెలా బ్రతకాలి…?
********* ********* *********
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల, ఎస్. జానకి
నల్లవాడే… అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే… ఓయమ్మ… రాధకే చిక్కనాడే
లేదమ్మ లేదు… రుక్మిణికే దక్కినాడే
|| నల్లవాడే||
వెన్నవంటి మనసున్న చిన్నవాడే
చిన్ననాటి నుండి నువ్వుకోరుకున్నవాడే…
ప్రేమకే బానిసై పోతాడే
కాదమ్మ… భక్తికే దాసుడై వుంటాడే
||నల్లవాడే||
నువ్వు వావి వరస వున్నదానివి
నువ్వు వలపు దోచుకున్న దానివి
మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ
||నల్లవాడే||
రాధాకృష్ణులు కధలేనమ్మా వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము లోకానికే అది ఆదర్శము
గోపాల బాలుడూ
నీ ప్రేమ లోలుడూ గోపాల కృష్ణుడూ
నీపాలి దేవుడు
వాడు నీ వాడే
కాదు నీ వాడే
కాదు నీ వాడే
కాడు కాడు కానే కా డే
నల్లవాడే… అమ్మమ్మ అల్లరి పిల్లవాడే