Earu Jolapadenayya Sami | ఏరు జోలపాడెనయ్య సామి

ఏరు జోల పాడేనయ్యా… లిరిక్స్

చిత్రం: చక్రవర్తి  (1987)
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాణం: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 05.06.1987

ఏరు జోల పాడేనయ్యా.. సామి
ఊరు ఊయలయ్యేనయ్యా.. సామి
ఎండి మబ్బు పక్కల్లో.. సామి
నిండు సందమామల్లే.. సామి
నేను లాలి పాడాల నువ్వు నిద్దరోవాల
ఎన్నెలంటి మనసున్న సామి

ఏరు జోల పాడేనయ్యా.. సామి
ఊరు ఊయలయ్యేనయ్యా.. సామి

మనిసి రెచ్చిపోతా.. ఉంటే సామి
మంచి సచ్చిపోతున్నాది సామి
దిక్కులేని పిల్లా.. పాపా.. సామి
చరపలేని సేవ్రాలయ్యా.. సామి
జ్యోతుల్లంటి నీ కళ్ళే..ఓ…
సీకటైన మా గుండెల్లో ఎన్నెల్లు
రాములోరి పాదాలే…ఓ…
రాతికైన జీవాలిచ్చే భాగ్యాలు
పట్టనీ నీ పాదాలు…
ఆంజనేయుడల్లే.. శాన్నాళ్ళు

ఏరు జోల పాడేనయ్యా.. సామి
ఊరు ఊయలయ్యేనయ్యా.. సామి

చెడ్డ పెరిగి పోతా.. ఉంది సామి
గడ్డు రోజులొచ్చేనయ్యా.. సామి
సుద్దులెన్నో సెప్పాలయ్యా.. సామి
బుద్ది మాకు గరపాలయ్యా.. సామి
నావకున్న రేవల్లే… ఏ…
మమ్ము దాచుకోవాలయ్యా నీ ఒళ్ళో..
పూవు కోరు పూజల్లే… ఏ…
నేను రాలిపోవాలయ్యా నీ గుళ్ళో..
కడగనీ నీ పాదాలు…
అంజిగాడి తీపి కన్నీళ్ళు

ఏరు జోల పాడేనయ్యా.. సామి
ఊరు ఊయలయ్యేనయ్యా.. సామి

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****