చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, చిత్ర
నటీనటులు: నాగార్జున, సౌందర్య, షెహనాజ్
దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 30.03.2001
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
నిసపా గమరి నిసపా
శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారి తెలిసిందే చెలిమి సంగతీ
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నది
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నది
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
హృదయాంతరంగ శృంగారగంగ
ప్రవహించె ప్రణయ పరవశంగా
మృధుశృంగ ధార మధురామృతాలే
జతిమధన మధుర మిధునమంతా
వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో
తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో
అమృతమై కురిశావే ప్రణయమధురిమా
ఓ…మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా
****** ****** *******
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంటరివాడే
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
గుడినీదే ఒడిని విడదీసె ఈ విపరీతం
ప్రాణాననికి దేహానికి కలహం పెట్టే పంతం
రామయ్య లక్ష్మయ్యా
విడిపోయె ఈ మాయా
కల్పించిన కలి వాల్మీకెవరో
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
పదిమందిని నడిపించే
పెద్దరికం పోయిందా
నడి వీదికి తలవంచే
శాపం వెంటాడింద
కరిమబ్బుల తెరవేస్తె
ఒక గ్రహనం ఎదురొస్తే
రవితేజం వెల వెల బోతుందా
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంటరివాడే
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
పల్లవి:
అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా (2)
నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు
నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు
హయ్యె రామ గడుసోడివే
అబ్బో దసరా బుల్లోడివే
అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా
చరణం: 1
ఎగిరే పైటల్లో గుండుసూది ఉంది
అది నా గుండెల్లో గుచ్చుతోంది
తడిమే చేతుల్లో ఉడుము దాగివుంది
అది నా నడుముల్లో ఆడుతోంది
రగిలే సోకుల్లో భలే కుంపటున్నది
బిగిసే కౌగిట్లో నన్నే కాల్చుతున్నది
మెరిసే నా ఒంట్లో పెట్టె మంచమున్నది
ముసిరే చీకట్లో నిసే వాల్చామన్నది
అందమైన పసిదానివే హోయ్
అంతు చూసే కసిదానివే
పొద్దుటేలా దొరబాబువే మాపటేల దొంగోడివే
అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా…
కోరస్:
హయ్యయ్యో సుబ్బు సుబ్బు
హయ్యయ్యో హయ్యయ్యో సుబ్బు సుబ్బు
చరణం: 2
మిరప తోటల్లో ఘాటు రేగుతుంది
నువు వాటేస్తే అలా మండుతున్నది
చెరుకు చేలల్లో తీపి తగులుతుంది
అది నవ్ ముద్దిస్తే దొరుకుతుంది
మావి పిందుల్లో అదో వగరు ఉంటది
నువు నా వెంటొస్తే అచ్చు అలా ఉన్నది
మల్లె పందిట్లో మరో లోకముంటది
అల్లే సందిట్లో అదే మైకమున్నది
హ పిచ్చి నీకు ముదిరిందిలే
వరస బాగా కుదిరిందిలే
పిల్ల చాలా నిరాజానలే అయిన జోడి అదిరిందిలే
అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా
నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు
నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు
అరెరె హయ్యె రామ గడుసోడివే
అబ్బో దసరా బుల్లోడివే
సిగ్గు చూస్తే చిన దానివే
గుండెదోచే చిత్రాంగివే..