Ee Abbai Chala Manchodu (2003)

Advertisements

చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు(2003)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, సునీత
నటీనటులు: రవితేజా, వాణి, సంగీత
దర్శకత్వం: అగాతియన్
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 14.01. 2003

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోనా.. రతనాల తోటలోన
వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన
విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో

నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవి కి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

*******   ******** *******

చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు(2003)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల
ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాల
పొగరే దిగనీ సొగసే కందనీ
అనుభూతి మనదైన వేళ
ఏహే.. హేహే..ఏహే..
ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల

Advertisements

ముద్దాడనా.. పెదవిని వలదని
నడుమును ముద్దాడుకో
వాటేయ్యనా.. ఎదురుగ వలదని
వెనకగ వాటేసుకో
చిన్నంగ నీ చెవిని స్పృశియించనా
నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా
ఆ పై లంఘించి విజృంభించి వివరించనా
నిదురా వద్దులే బెదురా లేదులే
చూడాలి శృంగార మేళ

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల

వేధించనా.. సరసవు సగమున
విడిపడి వేధించుకో
వడ్డించనా.. అడగని క్షణమున
ఎగబడి వడ్డించుకో
నా పట్టు వస్త్రాలు వదిలెయ్యనా
నీ గట్టి ఒత్తిళ్ళు తరియించనా
అంతా అయిపోతే తెగ సిగ్గేసి తల వంచనా
ఏహే..లాలా..ఏహె..లాలా..
వ్రతమే చెడనీ ఫలమే అందనీ
చేరాలి స్వర్గాల మూల

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల
ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాల

**********   **********   *******

చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: గంగ , ఎమ్.ఎమ్ కీరవాణి

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా… ఆ…ఆ…ఆ…ఆ…ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా… ఆ…ఆ…ఆ…ఆ…ఆ

చరణం: 1
పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా
నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా
మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవ యాత్రలో తోడు ప్రేమా
ప్రేమా… ఆ…ఆ…ఆ…ఆ…ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ

చరణం: 2
అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృత వర్షిణి ప్రేమ కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా… ఆ…ఆ…ఆ…ఆ…ఆ

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా… ఆ…ఆ…ఆ…ఆ…ఆ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Gulabi (1996)
error: Content is protected !!