Ee Nagaraniki Emaindhi (2018)

ee nagaraniki emaindhi 2018
చిత్రం: ఈ నగరానికి ఏమైంది (2018)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: కృష్ణకాంత్   
గానం: అనురాగ్ కులకర్ణి, మనీషా ఈరబత్తిని   
నటీనటులు: అభినవ్ గౌతమ్, సాయి శుశాంత్ రెడ్డి, విశ్వకేషన్ నాయుడు, కాకమాను వెంకటేష్, సిమ్రాన్ చౌదరి, అనిషా ఆంబ్రోస్, విజయ్ దేవరకొండ
దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం
నిర్మాత: సురేష్ బాబు
విడుదల తేది: 29.06.2018
ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో
నన్ను తాకెనా ఒక్కసారి
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ముందులేని ఊహలేవొ
రాలెను చినుకులాగా
అంతసేపు ఊపిరాగగా
ఆ ఆపైనె మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయే క్షణం
ఓపలేని వేసవేదొ వేలు తాకగా
ఓ కాగితాన నేను రాయగ అదే క్షణాన
ఇదేది ముందు చూడనంత
కన్నుల్లో సంబరంల
మరెంత ఉన్న చాలనంత
బంధించే పంజరంలా
నిశీధి దారిలోన యెండె
మొఖాన్ని తాకుతూనే ఉందే
ముందే రాగరూపం
నాపైన ఓ పూల వాన
ఆ చూపేనా ఓ
ఆపేన నే తీసుకోగ ఊపిరైన
ఓసారే వచ్చిందే
నా గుండెలోకి గుండెపోటులా
హో ఆపైనె మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయే క్షణం
రమా రమి జీవితం అమాంతమే మారె
స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచె
మీరు మెల్లంగ నీవు అయ్యెన ఇంకేదైన పేరుందా
కాలమేమొ వేడుకున్నా ఆగదు వేళ్ళమీద వీగిపోగా
నీ తోడులేక కాస్తైన కదలదు
తానుంటె అంతేలే ఇంకేదీ గురుతు రాని వేళలో
పోతోంది తరిగే దూరం మా జంట నడుమా
పెంచావు ఎదలో వేగం ఏ.. ఏ..
ఔతోంది త్వరగా గారం నీకంట పడినా
తెంచావు దిగులు దారం నీవే
ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో
నన్ను తాకెనా ఒక్కసారి
ఓ నేల వీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ఓ అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
బాధె చేరె వీలింక లేనే లేదే
తోడే ఉంటే మేలే
అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే
వచ్చే లేని ప్రేమే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top