Eenati Bandham Yenatido (1977)

eenati bandham yenatido 1977

చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఎం. బాలయ్య
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతలు: ఆలపాటి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు
విడుదల తేది: 02.06.1977

పల్లవి:
శిలనొక్క ప్రతిమగా…మలచింది నీవే…
ఆ ప్రతిమనీ.. దైవముగా…కొలిచింది నీవే…
నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…
కలనైనా తలచింది కానే కాదు…ఏనాటిదో ఈ బంధం…
ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం….

మదినొక్క గుడివోలే…మలచింది నీవే…
ఆ గుడిలోనే కరుణతో…వెలసింది నీవే….

నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…
కలనైనా తలచింది కానే కాదు…ఏనాటిదో ఈ బంధం…
ఈ వెన్నెల్లా… జాబిల్లి అనుబంధం….
నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…

చరణం: 1
నీ చెంతగ ఎన్నాళ్ళున్నా…నిన్ను చేరుకోలేదు…
ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు…

అపరంజి కోవెల ఉన్నా..అలరారు దైవం ఉన్నా…
ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి…లోనికి పిలుచుకున్నాయి….

నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…

చరణం: 2
కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను..
అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను..
నావకు తెరచాపనై…నడిపే చిరుగాలినై…
కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ…నీలో కలిసిపోయేనూ…

నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…
కలనైనా తలచింది కానే కాదు…ఏనాటిదో ఈ బంధం…
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం….ఉమ్మ్…ఉమ్మ్..
నేననుకున్నది కాదూ…ఇది నేననుకున్నది కాదూ…

******  ******  ******

చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు…
ఎంత తొందరలే హరి పూజకు …ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు… పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

చరణం: 1
కొలువైతివా దేవి నాకోసము…కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ….. తులసీ దయాపూర్ణకలశీ…
కొలువైతివా దేవి నాకోసము..తులసీ….తులసీ దయాపూర్ణకలశీ…
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ….. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి …..
మొల్లలివి …నన్నేలు నా స్వామికి…

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు… పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు… ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …

చరణం: 2
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు…
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం…
ఒక పువ్వు పాదాల….ఒక దివ్వె నీ మ్రోల….
ఒక పువ్వు పాదాల…ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం …..
ఇదే వందనం …..

ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్…ఉమ్మ్….ఉమ్మ్…ఉమ్మ్

*******   *******  *******

చిత్రం: ఈనాటిబంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: ఎం. బాలయ్య
గానం: సుశీల

పల్లవి:
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం: 1
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ…
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం: 2
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top