చిత్రం: ఏక వీర (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, గంటసాల
నటీనటులు: యన్. టి.ఆర్, టి.ఎల్.కాంతారావు, కె.ఆర్.విజయ, జమున
దర్శకత్వం: సి.యస్. రావు
నిర్మాతలు:డి.ఎల్. నారాయణ, బి.ఎ. సీతారాం
విడుదల తేది: 1969
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
నవ్వులా అవి కావు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్నీ చిగురించునా
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలా ధర రాగ భావనలు కన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలా ధర రాగ భావనలు కన్నాను
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ
ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
******* ****** *******
చిత్రం : ఏకవీర
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా.సి.నారాయణ రెడ్డి
గాత్రం: పి.సుశీల, యస్.పి.బాలు
నీ పేరు తలచినా చాలు …
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
ఏమి మురళి అది ఏమి రవళిరా …
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమీ రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా
నీ పేరు తలచినా చాలు
వెదురు పొదలలో తిరిగి తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
వెదురు పొదలలో తిరిగీ తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
ఎదపానుపుపై పవళించరా
నా పొదిగిన కౌగిట పులకించరా
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా!
మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా
కృష్ణా ..! నీ పేరు తలచినా చాలు
ఏమి పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూచి
శరబిందుచంద్రికల చేయిచాచి
తరుణాంతరంగమున దాగిదాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా………తొలకరించెరా
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
చల్లని రమణి చల్లని ఉల్లము
అల్లన ఝల్లన పరవశించెరా…
కృష్ణా …. నీ పేరు తలచినా చాలు…