చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్
నటీనటులు: తరుణ్ , శ్రేయ శరన్
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 02.10.2003
ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్ళతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ…
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా…
నచ్చజెప్పినా ఏ ఒకరు నమ్మరే ఎలా నన్నిపుడు నేనే నేనన్నా (2)
మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా…
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక
గుర్తుపట్టనే లేదసలు గుండెలోతులో గుసగుసలు తానొచ్చేదాక (2)
తెలియజెప్పింది తుంటరిగా వయసువచ్చిందని
తలుపుతట్టింది సందడిగా నిదర ఎన్నాళ్ళని
తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక…
ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ…
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా…
********** ********** **********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో…ఓ…ఓ…
తెలియని దారులలో… ఓ… ఓ…
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇదీ…
ఆ… ఆ… ఆ… ఆ…
మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకుని
ఆ… ఆ… ఆ… ఆ…
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో…ఓ…ఓ…
తెలియని దారులలో… ఓ… ఓ…
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
*********** ********** **********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్
కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కళ్యాణ సమయమిది
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… (2)
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
తందాన తందాన తానాన తానానా
తందాన తందాన తననన నా…
ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
నువ్వు వెతికే మజిలీ అవనా…
నెచ్చెలిగా మదిలో చేరనా…
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
మనసుకి మలి జన్మగా నువు మలిచిన బొమ్మగా
నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి
హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా
నన్ను కలుసుకుందా నింగి జాబిలి
నా మనవిని విననే వినవా…
ఇది నిజమని అననే ఆనవా…
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… (2)
******** ******* ********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్
మంచు తాకినా ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని
చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోని
చిగురాశలు రాలిన కొమ్మా చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
అందామని ఉన్నా అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ
తెలవారని రేయని నడిపే వెలుగవగలనా…
తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా…
నిదురించని నిజమై నిలదీసే గతమే
భరించలేని భారమై వెంటాడగా…
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో
********** ********** **********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, ఉదిత్ నారాయన్
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా…
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా
అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటే తప్పు లేదు అయినా
నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న…
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా…
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపునే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవే ఊహా గానమా
మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా… ఓ ప్రేమా ప్రేమా ప్రేమా…
******** ******** **********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత, శ్రీరాం ప్రభు
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య (2)
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
గుడిలో దివ్వేలా గుండెలో మువ్వలా
ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా
నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా
అందాల మందార కొమ్మా హోయ్ అల్లారు ముద్దైన బొమ్మా
నీలా నవ్వాలని నీతో నడవాలని
పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది
వచ్చే నూరేళ్ళ కాలానికి నువ్వే మారాణివంటున్నది
ప్రతి రోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది
లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది
తన ఒడిలో పుట్టింది అంటున్నది
మేఘాల పల్లకిలోనా…
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
నన్నే మరిపించగా నిన్నే మురిపించగా
ప్రతి రాతిరి వేళల్లో రాని చందమామయ్యని
నీ కలువ కన్నుల్లో ఎన్నో కళలు నింపాలని
నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం
నిన్నటి కన్నా రేపెంతో మిన్న చూడమన్న ఆశతో
సందడిగా చేరింది సంతోషం
మేఘాల పల్లకిలోనా…
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
********** ********* *********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
పెదవులు మరచిన చిరు నగవై నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ
కరగకుమా నా కన్నులనే వెలి వేసి…
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం
********* ********* *********
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుచిత్ర
Yes I am from bombay
come baby lets play
sing with me swing with me
dont you ever feel so
రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల
బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
తట్టి పిలవాలా బెట్టు వదిలేలా జట్టు కలిపేలా చెట్టు దిగావేలా
ఎత్తులో పొడగరి కట్టులో పొదుపరి కాపలా చాలదే చిలిపి చిన్నారి
ఊహలో అలజడి ఉరకదే తదుపరి ఊరికే దేనికి మాట కచ్చేరి
చక్కదనం చూడమని ఉక్కిరి బిక్కిరి చెయ్యకిలా
మక్కువనే అణుచుకుని చక్కెర చేదంటే ఎలా
హెయ్ అందరు చేరి మందలా మారి చెయ్యరా చోరి బెదరదే పోరి హా
బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
సొంపులే దోచుకో సొంతమే చేసుకో కాదని లేదని అడ్డు చెబుతానా
వద్దులే దాచుకో కొద్దిగా ఓర్చుకో వీధిలో విసరకే ఎంత బరువైనా
కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నె ధనం
కర్ణుడికే లేదుగదా నువ్వు చూపే ఈ దాన గుణం
అప్సరస మీద ఆశపడరాదా పౌరుషం లేదా పరువు చెడిపోదా
రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల