ఎట్టా నిన్ను పిలిసేది సామి… లిరిక్స్
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఆనంద్ గుర్రం
గానం: రామ్ మిరియాల
విడుదల తేది: 02.08.2020
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
లంబోదరా…! నేను ఏమివ్వనురా..!!
ఈసారికి ఎలాగోలా మన్నించరా…
లంబోదరా…! నేను ఏమివ్వనురా..!!
ఈసారికి ఎలాగోలా మన్నించరా…
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
బాజా భజంత్రీలు లేవు… భారీగా సెట్టేసే బడ్జెట్టు లేదు
పట్టు బట్టల ఊసే లేదు సామీ… పంచభక్ష పరమాన్నాలు లేవు
కోటి దీపాల్లేవు (కోటి దీపాల్లేవు)…
కొబ్బరి ముక్క లేదు (కొబ్బరి ముక్క లేదు)…
కోటి దీపాల్లేవు… కొబ్బరి ముక్క లేదు
అరటిపండు కరువే… హారతి బిళ్ళ బరువే
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామీ
ఎట్టా నిన్ను పిలిసేది సామీ… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామీ
లంబోదరా ఎట్టాగయ్యా… గట్టెక్కే దారేదో సూపించయ్యా
లంబోదరా ఎట్టాగయ్యా… గట్టెక్కే దారేదో సూపించయ్యా
ముక్కు మూతి మూసుకోని…
మనసులో తెలిసిందేదో మొక్కుకుంటా…
కాలు బైట పెట్టకుండా సామీ… మట్టితోనే నిన్ను చేసుకుంటాం
ఆశ పడకు సామీ (ఆశ పడకు సామీ)…
అలిగిపోకు సామీ (అలిగిపోకు సామీ)…
ఆశ పడకు సామీ… అలిగిపోకు సామీ
వచ్చే ఏడు భూంది లడ్డు పెట్టనా ఏమీ..!!
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామీ
ఎట్టా నిన్ను పిలిసేది సామీ… ఎట్టా నిన్ను కొలిసేది సామీ
ఎట్టా నిన్ను పిలిసేది సామి… అరె ఎట్టా నిన్ను కొలిసేది సామీ
ఎట్టా నిన్ను పిలిసేది సామీ… ఎట్టా నిన్ను కొలిసేది సామీ
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****