అయిగిరి నందిని లిరిక్స్
గాలే గీత గీస్తె ఆగదే.. నీడే ముసుగేస్తే దాగదే..
సత్యం చెరిపేస్తే స్వప్నం మారిపోదులే…
నేరం చేసిందే ఎవ్వరో…ఆ సాక్షం ఉందే నివురులో
అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే…
అన్ని దారులు జల్లెడేయనా.. నింగి నెలలన్నీ పొంచి చూడనా..
ఆకు రాలినా చప్పుడయ్యినా.. శత్రువున్న జాడ గుర్తు పట్టనా…
చీకటే ఓ ఉచ్చు లాగ మారే.. వేకువే ఏ దిక్కులోన దాగే..
ఎదురయ్యె ఈ ప్రశ్నలెన్నో నేడే.. ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ…
అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే..
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే…
భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే..
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే…
ఆయువన్నదే హరించే.. వ్యూహమెవ్వరో రచించే..
జాలి లేకనే వాదించే.. గాలి దాడిలోన దీపమారే…
ప్రాణమే తీసెనే కుట్ర పన్ని ఎందుకో.. దేహమైన మట్టి చేయు ద్వేషమెందుకోసం..
ఊపిరే తీసినా చెయ్యిదాగెనెక్కడో.. యముడు వేయు పాశమల్లె నా రాక తథ్యం…
చీకటే ఓ ఉచ్చు లాగ మారే.. వేకువే ఏ దిక్కులోన దాగే..
గంతలే నే విప్పుతాను నేడే.. చూసేలా లోకమే కాంతులేవో…