చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: కె. కె.
నటీనటులు: ఆర్యన్ రాజేష్ , దీపిక
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: లగడపాటి శ్రీధర్
విడుదల తేది: 21.01.2005
బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా
బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
చిలిపి చిలక వయసు కనుక ఇవ్వనా కానుకా
వలపు చిలికి పెదవి కొరికి చూపనా వేడుకా
తనువుతో తనువు తలబడి తాకగా హాయి రాబడి
నమ్మితే చూపుతా
బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వలపు పనికి పిలవకున్నా వేచివుంటానుగా
సొగసు ఉనికి తెలపకున్నా తెలుసుకున్నానుగా
నిప్పుకి తప్పు అంటదే యవ్వనం నిప్పులాంటిదే
అందుకే అందుమా
బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా
బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం