చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం:
గానం:
నటీనటులు: శ్రీకాంత్ , స్నేహా , నిఖిత
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: యమ్.దశరథ రాజు
విడుదల తేది: 15.95.2006
పల్లవి:
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హాయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
చరణం: 1
మునుపటి జన్మలతో ముడిపడు పుణ్యములే
నీ నీడ నిన్ను చేర్చనీ బతుకే నిండు పున్నమి
నా కంటిపాప నీవే నీ కంటి రెప్ప నేనే
ఏ నలుసులింక నేడు నిన్ను తాకలేవులే
కలిసిన మనసులలో కలతలు ఉండవులే
జతపడు హృదయములే జగములే మరుచునులే
నిజముగా కలకాదుగా
నిజమే నిజమే కలలాంటి నిజమిదే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
చరణం: 2
చిరు చిరు సరసాలు మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం తెలియదు వేరుకావటం
నేనాడుకున్న పేరే ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు మన కడుపు పండులే
గడిచిన గతమంత చేదుగా మిగిలేనే
కలిగిన చేదంతా తొలగునే ఇకపైన
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే నీ ఆశ తీరునే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హాయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే