చిత్రం: ఎవరైనా ఎపుడైనా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రీటా
నటీనటులు: వరుణ్ సందేశ్ , విమలా రామన్
దర్శకత్వం: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాతలు: యమ్.శరవన్ , యమ్.యస్. గుహన్
విడుదల తేది: 26.06.2009
పల్లవి:
మధుర యాతన ముదిరిపోయిన
చినుకు రాగాన చిలిపి తాళాన
నీటి ఊయలలో ఊగనీ ప్రాయం
వేడి ఊహలతో ఆడనీ గేయం
పెదవి కలగలిపే తరుణాన
చరణం: 1
శృతులు మించిన జతులు పెంచిన
వయసులో ఉన్నా వరదలౌతున్నా
ఘాటు కౌగిలితో ఆదుకో అందం
చాటు తేనెలతో తీరనీ దాహం
చినుకు సెగ రగిలే తడిలోన
చరణం: 2
తదిమ్ తానన తధం సాగిన
పడుచు థిల్లాన పలికెనీవాన
నీటిగాలులతో చెమట లారేనా
తీపి తేమలతో తపన తీరేనా
మెరుపు కనుగీటే పరువాన