
చిత్రం: ఎవరే అతగాడు (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.చరణ్ , శ్రీవర్ధిని
నటీనటులు: వల్లభ కె.యస్, ప్రియమణి, జయ షీల్
దర్శకత్వం: పి.బానుశంకర్
నిర్మాత: కిరణ్
విడుదల తేది: 11.01.2003
(నిర్మాత కె.యస్.రామారావు గారి కొడుకు వల్లభ)
ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
కళ్ళలో కలలు కలిసే మనసే
కదిలించె మరులు కురిపించె
కొత్త విరహాన ముంచినాడే
ఎవరమ్మా…
ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
భలేదొంగవమ్మ నువ్వు ఖలేజాలు ఎన్ని నీకు చిలకమ్మా
మాటవరసకైన నాకు చెప్పలేదు ఎవరమ్మా…
నిన్నా మొన్నటిదాన్ని నామాట కేమిగాని
చెట్టంత ఫ్రెండ్ కైన చెప్పలేదా
పలుకే బంగారమాయే కులుకే సింగరమాయే
చాల్లే బెట్టు ఎవరమ్మా
ఎవరో మాకు చెబితే లగ్గం చూసి పెడతాం
అమ్మడు విధిగా విదియో తదియో
సుముహూర్తమెట్టి శుభలేఖలేసి
నీ పెళ్లి జరపలేమా… ఎవరమ్మా…
ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
మరీచెప్పరాని వాడ మహా గొప్ప అందగాడా
ఎవరమ్మా… కోరస్: ఎవరమ్మా…
సరగాల ఇంటిదొంగ చలాకీల చంటి దొంగ
ఎవరమ్మా…
కోలాటమాడుకన్ను సయ్యటలాడు చూపు
ముద్దుల్లో ముంచినోడు
కోరస్: ఎవరమ్మా…
సందేళ్ల కోడి కుసే పందిళ్ళ ఈడు వేసే
ప్రేమించింది ఎవరమ్మా…
అసలే తోచదాయే ఒకటే తొందరాయే
ఎవ్వరాఘనుడు ప్రియుడు వరుడు
నిను మాయ చేసి మత్తేదో జల్లి
మనసిచ్చు కున్నవాడు ఎవరమ్మా…
ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
కళ్ళలో కలలు కలిసే మనసే
కదిలించె మరులు కురిపించె
కొత్త విరహాన ముంచినాడే
ఎవరమ్మా…