ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు… లిరిక్స్
చిత్రం: నేనే అంబాని (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్
నటీనటులు: ఆర్యా, నయనతార
దర్శకత్వం: రాజేష్. ఎమ్
నిర్మాణం: శివశ్రీ శ్రీనివాసన్
విడుదల తేది: 17.12.2010
Evaree Ammayani Adiga Song Telugu Lyrics
ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే.. ఈనాడు
నన్నే చూసేనే.. ఏదో అడిగెనే..
మాయే చేసెనే.. ఒహోఒహో
చూపుతో నవ్వెనే.. చూపులు రువ్వెనే..
గుండె గిల్లెనే.. ఒహోఒహో
చుక్కల్లో నడుమ జాబిల్లి తానే..
రెక్కలు తొడిగే సిరిమల్లి తానే..
ఏదో.. చేసే.. నన్నే ….
ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే.. ఈనాడు
నే తనని చూస్తే.. ఎటో.. చూస్తుంది
నే చూడకుంటే.. నన్నే చూసే…
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి నటనేదో చేసే…
స్త్రీ హృదయం అద్వైతం లాగా..
ఏనాడూ.. ఎవరికర్థమే.. కాదు
మగవాడి మనసూ.. తపియించే వయసు
ఆడవాళ్ళకి అలుసూ..
మది గాయపడ్డాక నాకోసం.. వస్తుంది
వానే.. వెలిసాక గొడుగిచ్చి వెళ్తుంది
ఏదో.. చేసే.. నన్నే.. ఏ.. హే.. హే…
ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే.. ఈనాడు
మా ఇంటి ముంగిట్లో.. తను వేసే ముగ్గులు
ఎప్పటికీ.. చెరిగి పోరాదంటా…
తన పెదవుల మందారం
తన పాపిట సింధూరం
నా గుండెకు సూర్యోదయమంటా…
అందాల గాజుల లాగా..
తన చేయి స్పర్శ తగిలితే చాలూ..
తన కాలి మువ్వ సవ్వడి నేనై ,
కల కాలముంటె మేలూ..
కమ్మని చెవిలో.. కబురే చెప్పెనే..
సిగ్గునై బుగ్గ మొగ్గే నిమిరెనే..
ఏదో.. చేసే.. నన్నే.. హే.. హే…
ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే.. ఈనాడు
నానానే.. నానే నానే నాన ననానీ..
నానానే.. నానే నానే నాన ననానీ.. హా..
ఒఓ.. ఓ.. ఓ.. ఒహొహో హే.. హే…
Nene Ambani Movie Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
s
nice
super app
hii
తెలుగు
hi
fucr ZZ