చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేంద్ర
నటీనటులు: శర్వానంద్, సురభి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల తేది: 14.01.2016
హే కాట్టుకెట్టిన కళ్ళను జుస్తే
కైటు లాగ ఎగిరెను మనసే
అయ్యబాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టవే
చేతి గాజులు సవ్వడి చేస్తే
చేపలాగ తుల్లెను వయసే
తస్సదియ్య గుండెల్లోన మంటే పెట్టావే
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
అందాల మోనాలిసా ఆ పెయింటింగ్ నేనూ చూశా
అరె ఆ సోయగం నీ ముందర ఏ మూలకోస్తాదే
భూగోళమంతా తిరిగా అరె గూగుల్ మొత్తం వెతికా
ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడ్లేదే
పాలపుంతకి ప్రాణం వస్తే పాలపిట్టకి పరికిని వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటాదే
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
నువ్వేమో చాలా గ్రేటు నీ చిరునవ్వుకెడితే రేటు
అరె బాహుబలి బుకింగ్ లా కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడితే పార్టీ అరె నీకింక ఉండదు పోటీ
నీ సొగసుకె దాసోహమై జేజేలు కొడతారే
న్యూటన్ ఏమో మళ్ళీ పుడితే ఇంతందం కంట్లో పడితే
భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటాడే
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా