చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మధు ప్రియ, రాంకీ
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి పల్లవి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 21.07.2017
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా జేషిండే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
పిలగాడొచ్చిండే…
మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మస్కాలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతి
ఓ సారి సరే అంటూ
ఓ సారి సారీ అంటూ
మెయింటైన్ నువ్ జేస్తే
లైఫంతా పడుంటాడే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేని
ఎక్కితే కాని అందడే
పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్స్ నాకున్నాయ్ లే
పరేషానే నీకక్కర్లే…
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
హే పిల్ల రేణుకా పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా జేషిండే
అరె ఓ పిల్ల ఇంక నువ్వు
నేల నడిచే గాలి మోటార్ లో
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
******** ********* *********
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అరవింద్ శ్రీనివాస్, రేణుక
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నది
అయినా చెయ్యి చాసి అందుకోకున్నది
రమ్మంటున్నా… పొమ్మంటున్నా…
వస్తూ ఉన్నా… వచ్చేస్తున్నా…
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
గుండెలో ఇదేమిటో కొండత ఈ భారం
ఉండనీదు ఊరికే ఏచోట ఈ నిమిషం
వింటున్నావా… నా మౌనాన్ని…
ఏమో ఏమో… చెబుతూ ఉంది…
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం
కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం
నా లోకంలో – నా లోకంలో
అన్నీ ఉన్నా – అన్నీ ఉన్నా
ఏదో లోపం నువ్వేనేమో
ఆ పై దూరం ఏం లేకున్నా
సందేహంలో ఉన్నానేమో
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
******** ********* *********
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హేమచంద్ర
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను
ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను
వల్ల కాదు పాలుపోదు
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళ కాదు వీలు లేదు
ఊహకాదు ఓర్చుకోదు
చంత లేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది
తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను
ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులులే కలలుగా నన్ను తరుముతాయే
ఆ కలవరం మెళకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
******** ********* *********
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హేమచంద్ర, మాళవిక
ఓ ఫిదా…
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో మారని ఋతువులున్నవే
నువు వచ్చుండే చోటున్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే…
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దుల్లో ఉండేవేనా
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పల్లోన
ఆమాత్రం నేనేంటో అర్ధంకానా
నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజాటం చంపేస్తోందే
గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెదకకు
మాటే తేలేలోన ఆపేస్తానా
బాదే దీనితోనే చెప్పేసేయన
నవ్వే దీని నుండి దాచేస్తాన దాచేస్తాన
మనసేయే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో గుండె చిక్కుకుందే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజాటం చంపేస్తోందే
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో మారని ఋతువులున్నవే
నువు వచ్చుండే చోటున్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే…
ఓ ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే…