చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్, కల్పన
నటీనటులు: అల్లరి నరేష్ , మదాల్స శర్మ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 14.01.2009
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా…
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా…
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
ఆరాటం ఆవురన్నా మొమాటం ఆపుతోంది
అయినా నీ చేతివాటం తనువంతా తాకుతోంది
నీ ఊపిరి కాగడాలకే ఈడంటు ఉన్నదా
నీ అల్లరి ఆగడాలకది చల్లారదా
ఆ సంగతే… ఆశరేపిందా – హాయ్ హాయ్
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
నీ ఒక్కడి వల్లనేగా ఈ వత్తిడి కాచుకున్నా
ఆ ఒంపులు కోసమేగా నీ వెంబడి సాగుతున్నా
నా కౌగిలి తాయిలాలనే కాసింక ఇవ్వనా
నీ సొగసుల శోభనాలనే కానివ్వన
నీ చూపుకే… వాడిపోతున్నా
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా…
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా…