Gaayam (1993)

చిత్రం: గాయం (1993)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: జగపతి బాబు, రేవతి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 22.04.1993

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలా…

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు

చరణం: 1
నా కోసమే చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
లల లల లలలలా…

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు

చరణం: 2
నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల లల లలలలా…

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలా…

అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు

**********  *********   **********

చిత్రం: గాయం (1993)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర, ఈశ్వర్

ఆ… ఆ… ఆ…
పాడనా గోపాలా కమ్మగా
కైపే కమ్మగా కళ్ళే వాలగా
ఊపనా ఉయ్యాల మెల్లగా
చల్ల చల్లగా ఒల్లే తేలగా
అరే గిదేం షురు చేసినావమ్మ
ఇయలరేపు ఎవడింతడు
పాటపాడితే కిక్ ఉండాలే

నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
బాగుంది భయ్ జర లాగింది భాయ్
దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే
పత్త లేక పారిపోయెరో

జింగారే జీగిచాక జింగిచాక (6)

పైటను చూడగానే పైత్యమొస్తదా
పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా
పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా
మన్ను తిన్న పాము లెక్క ఊరుకుంటే పరువు పోదా
పబ్లిక్ చూస్తరన్న ఖాతరుండదా
ఇజ్జత్ పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా
ఊర్కేనే ఉండమంటే మంచి మోకా జారిపోదా
ఆ హ హా…
వామ్మో వద్దమ్మో కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా

జింగారే జీగిచాక జింగిచాక (2)

యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది
తు తేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా
తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా
అక్కలు సెల్లెల్లు అందరుండినా
సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ

కమ్ డౌన్ బేబీ డోంట్ షై
వై డోంట్ యు టేక్ మీ ఆన్ ఎ డేట్ విత్ యు
ఓ మై లవ్… మై డార్లింగ్… యాహ్

ఎ ఎ ఏ ఏందయ్యో
ఏంటా స్పీడు లేదా బ్రేకు
అరె ఆట పాట సాగాలంట ఫికర్ దేనికంట

నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
నైజాం పోరి  నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి
బాగుంది భయ్ జర లాగింది భాయ్
దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే
పత్త లేక పారిపోయెరో

జింగారే జీగిచాక జింగిచాక (2)

error: Content is protected !!