Gaja Donga (1981)

చిత్రం: గజదొంగ  (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: యన్. టి.రామారావు, జయసుధ, శ్రీదేవి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: చలసాని గోపి, కె.నాగేశ్వరరావు
విడుదల తేది: 30.01.1981

పల్లవి:
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
ఊసులెన్నో చెప్పినాడే.. ఉట్టిగొట్టీ పోయినాడే
ఊసులెన్నో చెప్పినాడే.. ఉట్టిగొట్టీ పోయినాడే

అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అందమంతా ఆశపెట్టి.. అందకుండా పోయినావే
అందమంతా ఆశపెట్టి.. అందకుండా పోయినావే

అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ

చరణం: 1
ఎండల్లో..ఓ..కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
ఎండల్లో..ఓ..కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
చీరకెన్ని సారెలంటాడు.. నీ చీరకెన్ని మూరలంటాడు
ఈ మూరకెన్ని ముద్దులంటాడు

అంటదు అంటదు అంటావే… చంటిదానా
అంటదు అంటదు అంటావే… చంటిదానా
అంటకుండా నేను ఉంటానా.. కంటితోనే పిలవకుంటానా..ఆ
అంటకుండా నేను ఉంటానా..ఆ.. కంటితోనే పిలవకుంటానా..ఆ
కౌగిలింతై..కలవకుంటానా..

అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ..

చరణం: 2
చుక్కాల చీరకట్టి.. చుక్కలేళ్ళకు వస్తుంటే..
చుక్కాల చీరకట్టి.. చుక్కలేళ్ళకు వస్తుంటే..
లేడి చుక్క ఏరమంటాడు..నాకు చుక్కలే మక్కువంటాడు
ఆ లేడి చూపులెందుకంటాడూ..ఊ

అంటడు అంటడు అంటావే..ఏఏ..కొంటేదానా
ఆయ్..అంటడు అంటడు అంటావే..ఏఏ..కొంటేదానా
అంటితలకు నీళ్ళుపొయ్యనా..ఆ..జంటవలపు ధుపమెయ్యనా
అంటితలకు నీళ్ళుపొయ్యనా..ఆ..జంటవలపు ధుపమెయ్యనా
ఇంటి తలపూ..గడియ వేయనా..ఆ

అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ..
ఊసులెన్నో చెప్పినాడే..ఉట్టిగొట్టీ పోయినాడే
అందమంతా ఆశపెట్టి..అందకుండా పోయినావే

*******  ******   ******

చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా .. మోజుమీద సన్నజాజి పూలు పెడతావా

నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా .. మురిపాల మీగడంతా తోడిపెడతావా

GOLDMAN.. అహా …  GOLDMAN

చరణం: 1
బంగారు కొండమీద శృంగార కోటలోన ..చిలకుంది తెమ్మంటావా.. చిలకుంది తెమ్మంటావా
రతనాళ రాతిరేళా పగడాల పక్క చూపి .. పలికింది రమ్మంటావా

ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా .. హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో .. నీకందాక పని ఉంటే నన్ను చూసుకో

చరణం: 2
వజ్రాలవాడలోన వైఢూర్యమంటి నన్ను ..వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా
ముత్యాల మేడలోనా .. మాణిక్యమంటి నన్ను .. ముద్దాడ వస్తుంటావా

వరహాల పందిట్లో విరహాలు నీకేల .. రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో .. ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో

*******  ******   ******

చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి, కె.చక్రవర్తి

పల్లవి:
ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..ఆ.. ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆ..ఆ..హా..ఆ

ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..ఆ.. ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆ..ఆ..హా..ఆ

చరణం: 1
అర్రెర్రే..ఏ..ఏ.. కరెంట్ పోయిందే..
ఆ..అమ్మో..నాకు భయమేస్తుంది..
హ..హ..హ.. ఏం భయంలేదు నాదగ్గరగా రా
ఎక్కడ..?.. ఇక్కడే..
హు..మూ..ఎక్కడ…? ఇటూ..ఇటూ..అ..అ..అదీ..సుజా..ఆ
ఊహ..సుజా..మై డార్లింగ్..మూ..ఉహా..సుజా..ఆ

మసకలోనే..మనసుతీరా అల్లుకుంటున్నా..ఆ
ఇరుకులోనే..వలపుతీరా ఇల్లు కడుతున్నా..ఆ
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
నరనరాలలో..ఓ..ఓ నస..నసగా..
నాలో..నీలో గుస గుసగా..
గుండె గుప్పెడయిపోతుంటే..గుట్టు చప్పుడయిపోతుంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ..

ఇదో రకం దాహం..అదో రకం తాపం

చరణం: 2
ఇదిగో..ఇదిగో…ఏవి..ఏవిటయ్యా
అరగంట నుండి చూస్తున్నా..ఇది జైలు అనుకున్నారా..?
మీ ఇల్లు అనుకున్నారా.ఆ.? చూడలేక చస్తున్నాను వెధవది..

హ..హ.. చూడలేక చస్తున్నాడంట హ..హ పాపం..
అయితే ఓ పని చేద్దాం…

మళ్ళీ ఏమిటది..ఏమిటది శబ్ధం..?
దోమలయ్యా బాబు చచ్చిపోతున్నాం..చంపలేక..
హ..హ..హ..హ..హ..హ..హ..

పెదవి తాకి పెదవి దాహం పెరిగిపోతున్నా..ఆ..ఆ..
జరగనున్నది జాము రాతిరి..జరిగిపోతున్నా…ఆ..
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ..
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ.

కౌగిలింతలో..ఓ..కసికసిగా..ఆ..ఆ.
కరుగుతూ వుంటే..ఏ..ఏ..గజిబిజిగా..ఆ
ఇద్దరొక్కటయిపోతుంటే..ఒక్కరిద్దరయి ముద్దంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ

*******  ******   ******

చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట

చరణం: 1
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో
ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే
ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే

ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట

చరణం: 2
ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితెనేలో తానమాడించానా
పరువమనే పల్లకిలో అందమనే బాలికలా
వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు
పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో

ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Dwaraka (2017)
error: Content is protected !!