గల్లీ కా గణేష్.. మా గల్లీ కా గణేష్… లిరిక్స్
సంగీతం: రాహుల్ సిప్లిగంజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ సిప్లిగంజ్
నిర్మాణం: పృథ్వి రాజ్ రెడ్డి
నటీనటులు: రాహుల్ సిప్లిగంజ్, కోటి
జై భోలో గణేష్ మహరాజ్ కి… జై
శంకర్ జీ కా బేటా… ఘాడి పే బైటా
ఇగ చూస్కో నా పాట… ఆడ్దాంరా ఆట
ఏయ్..! శంకర్ జీ కా బేటా… ఘాడి పే బైటా
ఇగ చూస్కో నా పాట… ఆడ్దాంరా ఆట
పొర పోరలంతా కలిసి మీటింగ్ పెట్టినం…
కట్టల్ కట్టల్ చందాలేసి హుండీలేసినం…
పహిల్వాన్ గణేష్ తెచ్చి మండపంల కుసాబెట్టినం…
మా గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
పూరే మిల్క్ బోలోరే… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేష్…
అరె..! మా గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేష్…
దిస్ ఈజ్ రాహుల్ సిప్లిగంజ్…
మబ్బుల్తెచ్చి తడకల్ కట్టినం… టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చినం
బంతి పూల మాలలు కట్టినం… కింటాల్ కొబ్బరి కాయలు కొట్టినం
గల్లీ కా గణేష్… మా గల్లీ కా గణేష్…
పొద్దున్లేచి లడ్డుల్ చేశ్నం… మళ్ళీ లేచి పులిహోర చేశ్నం
మండీకి పోయి పండ్లు తెచ్చినం… నైవేద్యంగా స్వామికి పెట్టినం
ఆరిపోకుండా రోజు దీపం పెట్టినం… గంటకొట్టుకుంటు మేమె హారతి ఇచ్చినం
స్వామి మెల్ల దండలు వేసి… దండాలు పెట్టి దీవెన తీస్కుందాం
కమాన్ ఎవ్రీబడీ…
మా గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేష్…
అరరెరె..! పూరే మిల్క్ బోలోరే… గణపతి బప్పా మోరియా
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్… అవర్ గణేష్ ఈజ్ సూపర్ స్టార్
అరె..! కోటికి పోయి కుర్తలు కొన్నం… నెత్తికి మొత్తం రిబ్బన్లు కట్టినం
పెద్ద పెద్ద జెండాలు కొన్నం… జై అంటూ గాలిలూపినం
గల్లీ కా గణేష్… మా గల్లీ కా గణేష్…
అరె..! డీజే పెట్టి లొల్లే చేసినం… మహారాష్ట్ర కేళి బ్యాండ్ తెప్పించినం
డీజిల్ పోసి జనరేటర్ పెట్టినం… ఈ ఏడాది బై బై చెప్పి పొయ్యి రావయ్యా
ఆగ్లే సాలె ఇసి తానేసే లౌట్ కె ఆనా… హమ్ సఫిల్ కె చిల్లా చిల్లాకే షోర్ మచాకే జోర్ సె నాచెంగే
అరె..! మా గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేషురో… గణపతి బప్పా మోరియా
గల్లీ కా గణేష్…
అరె..! పూరే మిల్క్ బోలోరే… గణపతి బప్పా మోరియా
మా గల్లీ కా గణేష్…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****