Gandeevam (1994)

చిత్రం: గాండీవం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు, చిత్ర,  శ్రీ కుమార్
నటీనటులు: బాలకృష్ణ, రోజా, నాగేశ్వరరావు
దర్శకత్వం: ప్రియదర్శన్
నిర్మాతలు: సత్యం బాబు, సంపత్ కుమార్
విడుదల తేది: 18.08.1994

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా
గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా
గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్లనల్ల నీలల్లోన ఎల్లాకిల్లా పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటే సూరీడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికి వారే యమునకు వీరే
రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా
గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల ఇల్లా నవ్వే
బాలయొచ్చీ కోళటాలాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపమొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో
పరవశమేదో పరిమళమాయే హో
పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా
గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై

********     *********    *********

చిత్రం: గాండీవం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు , చిత్ర, ఎమ్. ఎమ్. కీరవాణి

ఆ… ఆ… ఆ…   ఆ… ఆ… ఆ…

సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే
పులకల కొమ్మా పుణ్యాలరెమ్మా పేరంటమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
ఊగక మన ఊయల అలిగింది ఈ పూట

చరణం: 1
వేయందాలలో నెలవంకా ఈ నేలవంకా దిగివచ్చేనా
శృంగారాలకే సెలవింకా జోలాలీలకే నిదురించేనా
పెళ్ళినాటి తుళ్ళిపాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డముందు అయ్యగారికీపనా
కలలే కన్నారు కమ్మగా ఇదిగో మీ కానుకా

చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే
కలికి చిలకా ఒడినే అలికే అనురాగమే చిలికించెలే

సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట

చరణం: 2
మా సంసారమే మధుగీతం పూసే యవ్వనా వనజాతాలే
పిల్లాపాపలా అనుబంధం దాచేసిందిలే తొలిగ్రంధాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే
ఎదలో ఉన్నాడు జీవుడూ ఎదురైతే దేవుడూ

పలికే మురళీ తలపై నెమలీ అది పాటగ ఇది ఆటగ
ప్రజలో డజనై భజనే పడితే కధ కంచికే మనమింటికే

సిరిపూల చెల్లాయి పాపా సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
పులకల కొమ్మా పుణ్యాలరెమ్మా పేరంటమేనాడే
ఊగక మనఊయల అలిగింది ఈ పూట

*********   **********   **********

చిత్రం: గాండీవం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్ పి బాలు, చిత్ర

తడిపొడి ముడిపడి పోనా అనువైన ఏకాంతానా
విడువను కుడి ఎడమైన ఇటుపైన ఏదేమైనా
జోడు బిగిసేన వరసైన సరసాన
ఇక చూడు సుఖశోభనం జత కుడు ఇంకనైనా
ఎగబడి తరమకు మైనా తగువాడి బలవంతాన
తెగబడి సతమతమైన మొగమాట పడిపోతానా

తానా తందానా కానీ ఆంటున్నా ఆడగాలితో ఆరితేరవా
సాహో కసికూన స్వాహా అయిపోనా చిత్తు జల్లుతో మత్తుపెంచక
ప్రాయం బరువెక్కిందన్నా పాపం అనవా
ప్రాణం కడబట్టిందన్నా మాటే వినవా
అదిరిన పెదవుల కధకలిలో ముదుమిడి పెదవులు కనబడవా
మతిచెదిరే శృతి ముదిరే మెళికలు మానవే
హేయ్… హుఁ హు

ఎగబడి తరమకు మైనా తగువాడి బలవంతాన
విడువను కుడి ఎడమైన ఇటుపైన ఏదేమైనా

Show Comments (0)

Your email address will not be published.