Gandikota Rahasyam (1969)

gandikota rahasyam 1969

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, జయలలిత
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 01.05.1969

పల్లవి:
మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

చరణం: 1
మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది
మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది
కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది
కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది
ఆ కోపంలో భలే అందముంది.. ఆ కోపంలో భలే అందముంది

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

చరణం: 2
కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను
కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను
ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను
ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను
ఏనాడైనా నీ వాడ నేను.. ఏనాడైనా నీ వాడ నేను..

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

******   *******  *******

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరు పేద కలువ వేచెనని మరచిపోదువా..ఆ..ఆ..

అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా..ఆ..ఆ..

నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా..

చరణం: 1
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
ఆ తళుకలలో పరవశించి కరగిపోదువా..

అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా..
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా..ఆ..ఆ..

నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా..

చరణం: 2
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకుంటిని
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకొంటిని
ఎన్నెన్ని జన్మలైన గాని నిన్ను మరతునా..ఆ..ఆ..

నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరు పేద కలువ వేచెనని మరచిపోదువా..ఆ..ఆ..

ఆహహాహ ఆహహాహ హాహాహహహా..
ఊఁహూఁహూఁహూఁహుఁ.. ఊఁహూఁహూఁహూఁహుఁ..

*****   ******   ******

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: సుశీల

పల్లవి:
అనురాగ గగనాలలోనా…ఆగింది కన్నీటి వానా…
మెరిసింది ఒక ఇంద్రధనువు…విరిసింది నాలోని అణువు అణువు…

నవ్వెను నాలో జాజిమల్లి…పొంగెను నాలో పాలవెల్లీ
కళ కళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ..
నవ్వెను నాలో జాజిమల్లి…పొంగెను నాలో పాలవెల్లీ…

చరణం: 1
నా ఆశలు పులకించెనా…నా పూజలు ఫలియించెనా…
నా ఆశలు పులకించెనా…నా పూజలు ఫలియించెనా
ఆ పరమేశ్వరి తూపులు నాపై అమృతధారలై కురెసెనా…
అమృతధారలై కురెసెనా…
నవ్వెను నాలో జాజిమల్లి…పొంగెను నాలో పాలవెల్లీ…

చరణం: 2
ఈ చీకటి విడిపోవునా…ఆ..ఎల వెన్నెల విరబూయునా…ఆ..
ఈ చీకటి విడిపోవునా…ఆ..ఎల వెన్నెల విరబూయునా…ఆ..
నవజీవన బృందావనిలోనా నా స్వామి నను చేరునా…
నా స్వామి నను చేరునా….

నవ్వెను నాలో జాజిమల్లి…పొంగెను నాలో పాలవెల్లీ
కళ కళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ..
నవ్వెను నాలో జాజిమల్లి…పొంగెను నాలో పాలవెల్లీ..

******   ******   ******

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
తెలిసింది తెలిసింది అబ్బాయిగారు
తెల్లారిపోయింది మీ కోడెపొగరు…
నేనే తోడు రాకుంటే..మీ పని అయ్యేది బేజారు

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు…
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు..
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు…

చరణం: 1
మాటలు వింటుంటే కోటలు దాటే…టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే
మాటలు వింటుంటే కోటలు దాటే…టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే
తెలిసే రంగు పాలపొంగు…వట్టి హంగు వగలు పొంగు..
తెలిసే రంగు పాలపొంగు…వట్టి హంగు వగలు పొంగు..
నీ అల్లరి చూపుల కళ్ళెం వేసి ఆడించకు…

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు…
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు..
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు…

చరణం: 2
కనుబొమ్మలాడితే కాలం ఆగే…విసురుగ సాగితే వెన్నెలలూగే…
కనుబొమ్మలాడితే కాలం ఆగే…విసురుగ సాగితే వెన్నెలలూగే…
లేత వయస్సు…లేడి సొగసు…కోతి మనసు కొంత తెలుసు
లేత వయస్సు…లేడి సొగసు…కోతి మనసు కొంత తెలుసు
నీ మెత్తని నవ్వుల గుత్తులు విసిరి వేధించకు…

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు
తెల్లారిపోయింది మీ కోడెపొగరు…
నేనే తోడు రాకుంటే..మీ పని అయ్యేది బేజారు

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు…
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు..
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు…

అహహహ..ఆహా..హా…అహహహ..ఆహా..హా…
ఓహొహొహొహొ..ఓహో..హో…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top